దేవాలయానికి వెన్నుముక వంటిది ఏమిటి ?

0
1177

Dwaja_Sthabham_Chirumarri

దేవాలయానికి వెన్నుముక  ధ్వజస్తంభం  ఎందుకంటే  పిడుగుల నుండి రక్షించేదిగా ఉంటుంది. ఒకవేళ ధ్వజస్తంభానికి దగ్గరలో దానికంటే ఎత్తుగా ఏదైనా కట్టడాలు కడితే ఆ కట్టడాలు పిడుగు దెబ్బలకు, అగ్నికి గురి కావడానికి అవకాశం ఎక్కువ .

ధ్వజస్తంభాన్ని దేవాలయపు వెన్నుముకగా తెలుపడం జరుగుతుంది. దేవాలయం యొక్క నడుము భాగంలో స్థంభం అడుగు భాగం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం గర్భగుడిలో దాకా అడ్డంగా వేనుబాములోలె పడుకోబెట్టినట్లు భావించబడుతుంది. కాని దాన్ని ఆకాశంలోకి నిటారుగా నిల్పడం జరుగును. దాని ఎత్తు ఖచ్చితంగా లెక్కించబడి ఉంటుంది. దాని తలపై ధ్వజస్తంభ వాహక దేవత ప్రతిష్టించబడి ఉంటుంది. ధ్వజస్తంబం పైన కుండలినీశక్తిని ముద్రించిన పతాకం ఏర్పరచబడి ఉంటుంది. ఈ కుండలినీశక్తి కలిగువున్న జండాను పైకి ఎత్తడమంటే, ప్రాణాయామం ద్వారా భక్తుని కుండలినీశక్తిని జాగృత పరచి సహస్రారానికి కోనిపోవడం అనే అర్థాన్నిఇస్తుంది.

                                                                       సేకరణ : నాగవరపు రవీంద్ర

NO COMMENTS

LEAVE A REPLY