దైవ భక్తుల యొక్క గుణాలు ఎలా ఉంటాయి ? మీకు తెలుసా ?

1
1716

దైవభక్తుల గుణాలు ఎలా.. అని స్కాంద పురాణం వైష్ణవఖండం ఇలా చెబుతోంది.

ప్రశాంత చిత్తం, సౌమ్యత, జితేంద్రియత, మనోవాక్కాయాల చేతా పరులకు కీడు తలపెట్టకుండటం, దయాగుణం, పరుల ఆనందాన్ని తనదిగా భావించడం, అందరి హృదయాల్లో ఉండే వాసుదేవుణ్ని గుర్తించడం… అనే గుణాలు గలవాళ్లు భక్తులు! శ్రీహరి చరణారవిందాలనే సదా ధ్యానిస్తూ ఉండటం చేత, చూసేవారికి జడులుగా కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస అలాగే కనబడేవాడు. మనసును, వాక్కును వినయంతో భగవంతుడికి సమర్పించడం వల్ల భక్తులు పరమశాంతంగా జీవిస్తారు. సదా భజనలతో కాలం గడుపుతారు. తానొక నీటిబొట్టు. భగవంతుడు మహాసముద్రం. ఆ మహాసముద్రంలో తాను కలిసిపోవడమే మోక్షం. భక్తుడి జీవితమే ఒక తపస్సు. ఆ మార్గంలో అతడు అనేకమై, అనంతమై, బ్రహ్మమై, తుదకు వాసుదేవుడవుతాడు.

భక్తిమార్గంలో ప్రయాణించేవారి హృదయంలో మానవత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. నిరంతర కృషి, సాటివారిపై దయ చూపడం- ఇవే మానవత్వ లక్షణాలు. ఈ సుగుణాలు లేకుండా ఉంటే ‘భక్తి’ ప్రదర్శన కేవలం ‘భుక్తి’ కోసమే. పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు, ఒంటినిండా బొట్లు మాత్రమే ఉంటే- అది ‘భుక్తి’ మార్గం. ‘భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భక్తి ఒక్కటుంటే చాలు బతికిపోవచ్చు’ అని కొందరు భావిస్తుంటారు.

1 COMMENT

LEAVE A REPLY