” TV9″ , “ABN” పని అయిపోయినట్టేనా ..?

0
254

abn-tv9-banned-telangana

 తెలంగాణాలో  “ABN” మరియు “TV9” న్యూస్ చానల్స్ ని బాన్ చేసిన విషయం అందరికి తెలిసిందే… దీనిపై కెసిఆర్ ప్రభుత్వం మీద చాలా విమర్శలు వచ్చాయి… కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు అని మీడియా వాళ్ళు దుయ్యబట్టారు… దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు.. అయితే ఇప్పుడు వాటికి మరో ఎదురు దెబ్బ తగిలింది… “ఆంధ్రజ్యోతి ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు తెలంగాణలో నిలిపివేసిన విషయంలో మేము జోక్యం చేసుకోలేం. కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ చట్టబద్దమయిన సంస్థ కాదు. అది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోనికి కూడా రాదు. అందువల్ల ఈ కేసులో మేము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేము. ఈ అంశంలో ప్రత్యామార్గాలు మీరే చూసుకోండి” అని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. 

ఈ సంచలన తీర్పుతో చానల్స్ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొనింది..మొదట్లో కెసిఆర్ మరియు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మధ్య సాన్నిహిత్యం బాగానే ఉండేది.. అయితే కెసిఆర్ పార్టీ కష్టాలలో ఉన్నపుడు ఆంధ్రజ్యోతి తీవ్రంగా విమర్శించింది, దీనితో వాళ్ళ మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి ..అదును కోసం వేచి చూస్తున్న కెసిఆర్ ” tv9″ లో తనకి వ్యతిరేకమైన ప్రసారం చేసిన దాన్ని బాణంగా వాడుకుని ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు “tv9” మరియు “abn” ని బాన్ చేసాడు …ఇప్పుడు హై కోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో  .. వాళ్ళు ప్రబుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తారోలేదో వేచి చూడాల్సిందే… 

NO COMMENTS

LEAVE A REPLY