ట్రాన్సిస్టర్‌కు కోటిన్నరా…!

0
404

pk-poster

రౖలుపట్టాలపై నగ్నంగా ట్రాన్సిస్టర్ అడ్డుపెట్టుకొని నిలుచున్న ఆమీర్‌ఖాన్… ‘పీకే’ చిత్రంలోని తొలి పోస్టర్ ఇది. దీంతోనే పీకేపై అంచనాలు ఓ స్థాయిలో మొదలయ్యాయి. తర్వాత ఒకటొకటిగా పోస్టర్‌లు, ప్రచార చిత్రాలు, పాటలు విడుదలయ్యాయి. వీటన్నింటిలోనూ ఆమీర్‌ఖాన్‌తోపాటు కనిపించే వస్తువు ట్రాన్సిస్టర్. ఇది ప్రేక్షకుల దృష్టినే కాదు చిత్రబృందాన్ని ఎంతగానో ఆకర్షించింది. చాలామంది దీనిపై మనసుపడ్డారు. చిత్ర కథానాయిక అనుష్కశర్మ అయితే ఏకంగా ఓ అడుగు ముందుకేసి ఆ ట్రాన్సిస్టర్ నాకు కావాలంటూ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, ఆమీర్‌ఖాన్‌లను అడిగేసింది. ‘నువ్వే కాదు మేమూ మనసుపడ్డాం ఆ ట్రాన్సిస్టర్‌పై’ అని చెప్పేశారు. తాజాగా దీనిపై ఆన్‌లైన్‌లో వస్తువులను వేలం వేసే ఓ సంస్థ కన్నుపడింది. ఏకంగా రూ.1.5కోట్లు ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకొచ్చిందని సమాచారం. మహాఅయితే రూ.200-300 మధ్యలో ఉండే ఈ ట్రాన్సిస్టర్‌కు ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ వచ్చినా ఆమీర్‌ఖాన్ ససేమీరా అన్నాడట. ‘ఈ ట్రాన్సిస్టర్ నాకెంతో ప్రియమైంది. దీన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు’ అని ఆమీర్‌ఖాన్ చెప్పాడట. ”ట్రాన్సిస్టర్ కోసం భారీ మొత్తం ఇవ్వడానికి ముందుకొచ్చిన మాట వాస్తవమే”అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం.

NO COMMENTS

LEAVE A REPLY