top 10 websites

0
1255

download

బాష ….మనసుల్లో ఉన్న భావాలను ఇతరులకు సులభంగా తెలియజేయటానికి మనిషికున్న గొప్ప సాధనం.
ఇంగ్లీష్ ఒక్కటే బాష గా మారుతున్న ఈ రోజుల్లో క్రమక్రమంగా ఇతర భాషలకి కుడా ప్రాముఖ్యం సంతరించుకుంటుంది.

ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచీకరణ నేపధ్యంలో చాలా మంది వివిధ బాషా అనువాదికులగా (translators) మంచి జాబులు పొందుతున్నారు , జేబులు కుడా నింపుకుంటున్నారు. ముఖ్యంగా ఐ.టి, బి.పి.ఓ రంగాలలో ఇతర దేశాల బాషలు వచ్చిన వారి అవసరం పెరుగుతుంది.మన దగ్గర రామకృష్ణ మిషన్ , ఇంగ్లీష్ & ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ వంటి  ద్వారా చాలా మంది ఇతర దేశాల బాషలు నేర్చుకుంటున్నారు.

అయితే ఈ బిజీ లైఫ్ లో ఎప్పుడయినా ,ఎక్కడయినా నేర్చుకునే విధంగా ఆన్ లైన్ లో కొన్ని వెబ్ సైట్స్ ద్వారా వివిధ దేశ బాషలు నేర్చుకునే సదుపాయం మనకి అందుబాటులో ఉంది. వాటిల్లో కొన్ని టాప్ వెబ్ సైట్స్ కింద ఇవ్వటం జరిగింది.

Dulingo.com– బాగా పాపులర్ అయిన వెబ్ సైట్.దీని మొబైల్ ఆప్ ద్వారా మొబైల్ లో కుడా మనం నేర్చుకోవ్వచు. గేమ్స్ లో పాయింట్స్ లా , దీనిలో కుడా ఒక్కో లెవెల్ దాటటానికి పాయింట్ లు ఉంటాయి.

BBC భాషలు – BBC నలభై భాషల్లో వ్యాకరణం, పదజాలం, గేమ్స్, కార్యకలాపాలు, మరియు పరీక్షలు తో పాఠాలు అందిస్తుంది.

livemocha.com – 35 భాషలకు ఆన్లైన్ కోర్సులలో.దీనిలో హిందీ కుడా ఉందండొయి.

lang-8.com – మీ కొత్త భాష లో వ్రాయండి, ఒక స్థానిక స్పీకర్ అంటే ఆ బాష వచ్చిన వ్యక్తి మీ తప్పులు సరి చేస్తారు.

babadum.com – ఆడుకుంటూ బాష నేర్చుకోవాలనుకుంటే ఈ సైట్ చుడండి. ఇదొక పదజాలం క్విజ్ ఆట.

verbling.com – మీరు ఒకరికి ఒక బాష నేర్పండి , వారు తీరిగి మీకోక బాష నెర్పూతారు.

internetpolyglot.com – పాఠాలు మరియు భాషలు నేర్చుకోవడం కోసం ఆట.దీనిలో తమిళ్ , హిందీ బాషలు ఉన్నవి.

lingro.com – వెబ్ సర్ఫింగ్ చేస్తున్న సమయంలో పదజాలం తెలుసుకోండి.

digitaldialects.com – గేమ్స్ ఆడుకుంటా ఉచితంగా 70 భాషలు నేర్చుకోవచ్చు. దీనిలో హిందీ కుడా ఉంది.

123teachme.com – స్పానిష్ నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఒక ఉచిత సర్వీసు.

 

NO COMMENTS

LEAVE A REPLY