తెర పైకి “ప్రత్యేక రాయలసీమ”

0
282

 Rayalaseema

 

రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు…ప్రత్యేక తెలంగాణ నిర్ణయాన్ని ఎంతో మంది వ్యతిరేకించినా కూడా, సోనియాగాంధీ ప్రభుత్వం తెలంగాణకి ప్రత్యేక హోదా కట్టబెట్టింది..సందులో సడేమియా లాగా  అప్పటిలో కొంత మంది ” ప్రత్యేక రాయలసీమ ” , ” ప్రత్యేక ఆంధ్ర ” నినాదాలు  లేవనెత్తారు..అయితే ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు.. ఇప్పుడు మళ్ళీ ” ప్రత్యేక రాయలసీమ ” అంశం తెర పైకి వచ్చింది..

రాష్ట్రం రెండు ముక్కలు అయిన తరువాత ఆంధ్ర రాజధాని విజయవాడ కేంద్రంగా ఉంటుంది అని వాదనలు గట్టిగా వినిపించాయి..అయితే ఈ వార్తలు కొంతమందికి మింగుడు పడట్లేదు ..ఆంధ్రలో అభివృద్ధి బాగానేఉంది అని..రాయలసీమ లోనే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి అని..అందుకని రాజధానిగా రాయలసీమలో ” కర్నూల్ జిల్లా ” ని ప్రకటించాలని ” రాయలసీమ రాజధాని సాధన సమితి ” డిమాండ్ చేసింది, ఒకవేళ అలా చేయకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం లేవదీయడానికి వెనుకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరించింది… మరి ఇరు పక్షాలకు వీలుగా ఉండేలా రాజధాని ని సిఎం చంద్రబాబు  ఎక్కడ పెడతారో వేచి చూడాల్సిందే…   

NO COMMENTS

LEAVE A REPLY