కమెడియన్ తో………సెకండ్ హీరోయిన్ గా

0
361

tamanna-hot-navel-stills-in-badrinath-picture-other

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో అగ్ర హీరోలతో నటిస్తున్న తమన్నా ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తమిళంలో ఒక కమెడియన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో అతనిపక్కన సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. శివకార్తికేయాన్ అనే తమిళ కమెడియన్, అదేనండి 2012లో ధనుష్ హీరోగా రిలీజ్ అయిన “3-కొలవరి” చిత్రంలో హీరో పక్కన కమెడియన్ గా నటించాడే అతను ఈ మధ్య హీరోగా అవతారం ఎత్తి వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పుడు అతని పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించనుంది. గతంలో శివకార్తికేయాన్ హీరోగా “వరుత్తపడతా వాలిబార్ సంఘం” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన పొనరం ఇప్పుడు అతనితో “రజని మురుగన్” అనే  చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మొదట ఈ పాత్రకు సమంతా ని అనుకోని చివరకు తమన్నాని ఫైనల్ చేసారు చిత్ర వర్గాలు. ఈ చిత్రాన్ని తమిళ్ లో సుప్రసిద్ధ దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తుంటే మరో దర్శకుడు సముద్రఖని ఈ చిత్రంలో విలన్ గా నటించనున్నారు. నవంబర్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతుంది.

NO COMMENTS

LEAVE A REPLY