పాపాలనుండి, శత్రుబాధలు నుండి విముక్తుల కావుటకు,రాజ్యాధికారం,ధనధాన్య సమృద్ధి పొందుటకు మార్గం ఏమైనా ఉందా ?

0
2265

 

Gaja_Laxmi

శ్రీ మహాలక్ష్మీ అష్టకం  ఫలశ్రుతి మీరు ఒక్కసారి చూడండి. దిగువ వివరణ ఇవ్వబడింది . మనకు పాపాలనుండి, శత్రుబాధలు నుండి విముక్తుల కావుటకు,రాజ్యాధికారం,ధనధాన్య సమృద్ధి పొందుటకు మార్గం శ్రీ మహాలక్ష్మీ అష్టకం వలనే అని తెలుస్తుంది .

ఫలశ్రుతి

మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

ఇంద్రకృతం శ్రీ మహాక్ష్మ్యస్టకం సంపూర్ణం ||

ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు. రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు. రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం – పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది. శుభాలు కల్గిస్తుంది.

వివరణ : ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం. భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది. సర్వం మహాలక్ష్మీ ఆధీనం. ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు. కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు. వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహపాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది. అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి. త్రిలోకాధిపతియగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య శ్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు.

శ్రీ మహాలక్ష్మీ అష్టకం

నమస్తేసు మహామాయే శ్రీ పీఠే సురపూజితే

శంఖచక్ర గధాహస్తే మహాలకక్ష్మీ నమోస్తుతే

నమస్తే గరుడారూఢే దోలాసురభయంకరి

సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే 1

సర్వజ్నే సర్వవరదే సర్వదుష్ట భయంకరి

సర్వపాపహరేదేవీ మహాలక్ష్మీ నమోస్తుతే

సిద్ది బుద్దిప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని

మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే

ఆద్యంత రహితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి

పరమేశీ జగన్మాత ర్మహాలకక్ష్మీ నమోస్తుతే

శ్వేతాం బర ధరేదేవి నానాలంకారభూషితే

జగత్‍స్థితే జగన్మాత ర్మహాలక్ష్మి నమోస్తుతే

NO COMMENTS

LEAVE A REPLY