sesha talpam

0
528

12241419_926340297450773_1507148673181658378_n! చెక్కబల్లే… శేషతల్పం !!
👉 మూడున్నర మూరల పొడుగు… జానెడు వెడల్పు గల ఆ చెక్కబల్ల… మసీదు కప్పుకు చింకి గుడ్డలతో ఉయ్యాలలా వ్రేలాడగట్టబడి వుంది… ఆ ఉయ్యాలకి నాలుగు మూలలా ప్రమిదల్లొ నాలుగు దీపాలు వెలుగుతున్నాయి… ఆ దీపాల మధ్యగల ఖాళీలో… నిశ్చితంగా నిద్రిస్తున్నారు బాబా… అది చెక్కబల్లా..? లేక శేషతల్పమా..? ఎలా సాధ్యం..? ఆ చెక్కబల్ల నేలమీద వుంటేనే ఒకరు విశ్రాంతిగా పడుకొవడం సాధ్యం కాదు… ఇరుకుగా వుంటుంది పైగా బరువు… అలాంటి బరువైన బల్లని… ఆ గుడ్డ పీలికలు మొయ్యడమే కష్టం… మరి బాబా బరువుని కూడా ఎలా భరిస్తున్నాయి..? ఆ ఉయ్యాల మీదికి బాబా ఎలా చేరగలిగారు…? అక్కడ నిచ్చెన ఎత్తుబల్ల లాంటివి లేవు గదా..? బాబా క్రిందికి ఎలా దిగుతారు..?
👉 ఇది బాబా లీల తప్ప మరేమి కాదని నిశ్చయించుకుని… తాత్యా… శ్యామ… ఇద్దరూ… బాబా చెక్కబల్ల మీదకి ఎలా ఎక్కుతారు..? ఎలా దిగుతారు..? చూద్దామని చాటునుంచి చూసేవారు… బాబా మసీదులొ తన స్థానంలొ కూర్చుని కన్పించేవారు… ఉన్నట్టుండి హఠాత్తుగా రెప్పపాట్లొ… చెక్కబల్ల మీద పడుకుని కన్పించేవారు… కన్నుమూసి కన్ను తెరిచే లొపు… బాబా బల్లమీదకి ఎలా చేరేవారొ… ఎవ్వరికి అంతుబట్టలేదు… అయితే ఆ లీలని చూడడానికి జనం తండోప తండాలుగా వస్తుండటంతో విసుగు చెంది… ఆ చెక్కబల్లని విరిచి ధునిలొ వేసేశారు బాబా…!
👉 భక్తుల గోల భరించలేక… బల్లని అగ్నికి ఆహుతి చేశారా..? అంటూ బాధపడ్డాడు శ్యామా…! ఈ దేహం ఆ మంటల్లొ కాలిపొతున్నా… ఏడవకూడదు శ్యామా…! చెక్కబల్ల కాలిపొతున్నందుకు ఏడుస్తావేం…! అని అన్నారు బాబా నిర్లిప్తంగా…! బాబా మాటల్లొ సత్యం వున్నది…! బాబా మాటల్లొ యధార్థం వున్నది…! బాబా మాట్లాడే ప్రతి మాటకి ఒక కారణం వుంటుంది…!
!!ఓం సాయి శ్రీ సాయి..జయ జయ సాయి !!

NO COMMENTS

LEAVE A REPLY