సీమాంధ్రులు నమ్మకం కోల్పోయారు

0
250

రాజధాని శాంతి భద్రతలు గవర్నర్‌కివ్వండి 

హోంమంత్రిని కోరిన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 

seemandhra-capital

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కేంద్రం సవరణలు చేపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బృందం బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి మూడు అంశాలను ఆయన దృష్టికి తీసుకు వచ్చింది. అవి…

1) పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోయే ఏడు మండలాలతోపాటు బూర్గంపాడు రెవెన్యూ గ్రామాన్ని కూడా బిల్లులో చేర్చాలి.

2) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అంగీకరించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిస్తున్నట్లే లెక్క. అందువల్ల పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి సంస్థలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.

3) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 8వ నిబంధన ప్రకారం ఉమ్మడి రాజధాని ప్రాంతంలో నివసించే అందరి ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తులకు రక్షణ కల్పించే ప్రత్యేక బాధ్యత గవర్నర్‌కు ఉంది. అందుకు అనుగుణంగా వెంటనే నిబంధనలు రూపొందించాలి.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రజల్లో అభద్రత భావాన్ని రేకెత్తిస్తోందని వై.ఎస్.చౌదరి నేతృత్వంలోని ఎంపీలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తులను కాపాడే విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించగలదన్న విశ్వాసాన్ని వారు కోల్పోయారన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY