“సల్మాన్ ఖాన్” పెళ్లి ఇన్విటేషన్

0
343

Untitled-1 copy

ప్రేమించినా, ద్వేషించినా సల్మాన్ తరువాతే ఎవరైనా అని బాలీవుడ్ తో అనుబంధమున్న వారు చెబుతారు. ముఖ్యంగా, వ్యక్తులను అభిమానించడంలో సల్మాన్ ఖాన్ ను మించిన వారు లేరు. తాను ఎవరినైనా నమ్మితే వారికోసం ఎంతదూరమైనా వెళతాడని, ఏమైనా చేస్తాడని బాలీవుడ్ టాక్. తాజాగా, అదే విషయాన్ని రుజువు చేస్తున్నాడు బాలీవుడ్ కండల వీరుడు. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మను ప్రేమించింది. చెల్లెలిని ఎంతగానో ఇష్టపడే సల్లూ ఆమె పెళ్లిని ఘనంగా చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు, సోదరి వివాహ వేడుకకు వేదికగా ప్రముఖ చారిత్రక కట్టడం హైదరాబాదులోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎంచుకున్నాడు. ఈ నెల 18న తన చెల్లి పెళ్లి కోసం అరవై గదులున్న ఈ ప్యాలెస్ మొత్తాన్ని సల్మాన్ రెండు కోట్ల అద్దె చెల్లించి బుక్ చేశాడు (డెకరేషన్, ఇతర సరంజామా కోసం అదనంగా చెల్లించాల్సిందే). ఖాన్ పరివారం మొత్తం 18నే హైదరాబాద్ చేరుకుంటారు. పెళ్లి పూర్తయ్యాక 20వ తేదీన తిరిగి ముంబై చేరుకుంటారు. పెళ్లి వేడుకకు కేవలం 250 మందిని మాత్రమే ఆహ్వానించినట్టు పెళ్లి కుమార్తె సన్నిహితులు తెలిపారు. టాలీవుడ్ నుంచి వెంకటేష్, సురేష్ బాబులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సల్లూ భాయ్ తల్లిదండ్రుల పెళ్లి రోజు కూడా నవంబర్ 18 కావడం విశేషం.

NO COMMENTS

LEAVE A REPLY