“శుద్ధి” అంచనాలను పెంచిన సల్మాన్ ఎంట్రీ

0
214

Salman-Khan-gets-nervous-while-hosting-awards-function

మల్టీ స్టార్ సినిమాలు మనకు ఇప్పుడు కొత్త అయ్యుండచ్చు కానీ బాలీవుడ్ వాళ్ళకి మాత్రం కొత్త కాదు. అక్కడ ప్రతి చిత్రంలోను ఇద్దరు హీరోలు తప్పకుండా నటిస్తారు, ఎక్కడో చోట కనీసం చిన్న పాత్రైన వేస్తారు. అటువంటి మల్టీ స్టార్ సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులకి మాములే కానీ ఇద్దరు బడా హీరోలు, ఒక్కొకరికి 200 కోట్ల రూపాయిల మార్కెట్ వున్న హీరోలు కలిసి నటిస్తే ఎలా వుంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో జరగబోతుంది అదే ఆ ఇద్దరు హీరో లు ఎవరు అనుకొంటున్నారు ఒకరు సల్మాన్ ఖాన్ మరొకరు హృతిక్ రోషన్. వీరు సింగల్ గా నటిస్తేనే పెద్ద పండగ లాగా వుంటుంది మరి ఇద్దరు కలిసి నటిస్తే ఎలా వుంటుంది ప్రస్తుతం జరగబోతుంది అదే. స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “శుద్ధి” ఇప్పటికీ ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్, హీరోయిన్లుగా కరీనా కపూర్, దీపికా పడుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి సల్మాన్ ఖాన్ కొత్తగా వచ్చి చేరాడు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ద్రువపరిచాడు. అయితే కరణ్ జోహార్ తీస్తున్న శుద్ధి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

NO COMMENTS

LEAVE A REPLY