roti

0
402

11817257_1000614373304912_6651028495324921635_n

• పెరుగూ, సెనగపిండితో రోటీ

 
కావల్సినవి:గోధుమపిండి – రెండున్నర కప్పులు, సెనగపిండి – రెండు కప్పులు, చిక్కటి పెరుగు – అరకప్పు, సోంపు – చెంచా, కారం – చెంచా, జీలకర్ర – అరచెంచా, ఉప్పు – కొద్దిగా, నెయ్యి – పావుకప్పు, కొత్తిమీరా – కొద్దిగా.

తయారీ: నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా చేసుకోవాలి. ఈ పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. తరవాత దీన్ని వేడిపెనంపై ఉంచి, నెయ్యి వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. ఇలానే మిగిలిన పిండినీ చేసుకోవాలి. ఈ రోటీలను ఉల్లిపాయ రైతా లేదా ఏదయినా చట్నీతో తినొచ్చు.

SHARE
Previous articlepappucharu
Next articlegolden dosa

NO COMMENTS

LEAVE A REPLY