రెండో రాజధానిగా ” వరంగల్ ” ?

0
329

warangal

తెలంగాణా చారిత్రిక సంపదకి ” వరంగల్ ” జిల్లా కేర్ అఫ్ అడ్రస్ … ఎంతో చరిత్ర ఉన్న వరంగల్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్ తరువాతి స్థానంలో ఉంటుంది.. అందుకని తెలంగాణా ప్రభుత్వం వరంగల్ ని రెండో రాజధానిగా తీర్చిదిద్దాలి అనే యోచనలో ఉంది..అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది..ఆగష్టు 15న వరంగల్ లో జెండా వందనం చేయనున్న తెలంగాణా సిఎం కెసిఆర్ అక్కడ దీని గురించి ఒక అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు..

అయితే వరంగల్ నుండి క్షేత్ర స్థాయిలో పని చేయడానికి ఇంకా సమయం పడుతుంది అని , అప్పటివరకు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో ప్రాజెక్ట్ లు కేటాయిస్తున్నారు.. మరో వైపు కరీంనగర్ ని లండన్ లా తీర్చిదిద్దుతాం అన్న కెసిఆర్ ,ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు …  తెలంగాణ అభివృద్ధి గురించి ఎన్నో వాగ్దానాలు చేసిన కెసిఆర్ వాటిని నిలుపుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.. 

NO COMMENTS

LEAVE A REPLY