సీఎంను వదిలి.. ప్రభాస్ ఇంటి దారిపట్టిన పోలీసులు

0
2012

Slide1

ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్న మార్గంలో బందోబస్తు ఉండాల్సిన పోలీసులు సినీనటుడు ప్రభాస్ ఇంటిదారి పట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటన శుక్రవారం జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాదాపూర్ వైపు వెళ్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ముందస్తు సమాచారం ఉంది. కానీ ఆ మార్గంలో బందోబస్తు ఉండాల్సిన పోలీసులు నటుడు ప్రభాస్ ఇంటికి వెళ్లారు. ప్రభాస్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు వస్తున్నారని తెలిసి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే అక్కడికి వెళ్లారు. ఆలస్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు ఆ సిబ్బందిని పిలిచి తీవ్రంగా మందలించారు. నివేదికను కోరినట్లు సమాచారం.

NO COMMENTS

LEAVE A REPLY