పవన్ కల్యాణ్ జనసేనకు ఈసీ గుర్తింపు

0
326

janasena

సినీ హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించింది. గురువారం జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. జనసేన పార్టీ తరపున ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇచ్చింది. ఈ రెండు పార్టీల తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. పవన్ జనసేన కార్యవర్గాన్నిఇంతవరకు ప్రకటించలేదు. ఎన్నికల తర్వాత ఓ సినిమాలోనటించారు. వెంకటేశ్ ‘గోపాల గోపాల’ సినిమాలో ఆయన అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

NO COMMENTS

LEAVE A REPLY