అలా చేస్తా చెప్పుతీసుకుని కొట్టండి : పవన్ కళ్యాణ్

0
546

pawan-ndtv

”ఎంతో మంది త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆనాడు మనకెందుకులే అని త్యాగమూర్తులు అనుకుంటే ఈనాడు ఇలా ఉండగలిగే వారమా? సమాజం మనకు ఏమిచ్చిందని కాకుండా సమాజానికి మనమేం మేలు చేశామన్నది ప్రధానం. సమాజంలో మార్పు విద్యార్థులతోనే వస్తుంది. యువతలో ప్రశ్నించేతత్వం రావాలి” అని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎమ్మార్ సంస్థల్లో మంగళవారం ఆయన విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. సినిమాల్లో నీతి చెప్పాలంటే చాలా తేలికని, నిజజీవితంలో అన్యాయాన్ని ఎదిరించాలంటే చాలా ధైర్యం కావాలని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి విద్యార్థి తయారు కావాలంటూ దిశానిర్దేశం చేశారు. ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వెళ్లాలని, వారికి భద్రత ఉండే సమాజం కావాలని, ఎవరైనా తప్పు చేస్తే నిలదీసే సత్తా ఆడపిల్లలకు ఉండాలని పవన్ ఉద్బోధించారు. ఆడపిల్లలను ఎవరైనా ఏడిపిస్తే వారిని చెప్పుతో కొట్టాలని, అందరం ఐక్యమత్యంతో ఉంటే తప్పు చేసేవారు పారిపోతారని పేర్కొన్నారు.
పరిసరాల పరిశుభ్రతతో మనసు స్వచ్ఛం
‘స్వచ్ఛభారత్’ నినాదం ప్రధాని మోదీదో, భాజపాదో కాదని, ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని పవన్‌కల్యాణ్ సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనసు స్వచ్ఛంగా ఉంటుందన్నారు. మన దేశం, మన ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ బాగు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జీఎమ్మార్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను పరిశీలించారు. నాగావళి గ్రామీణాభివృద్ధి సంస్థ (నైరేడ్)లో శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. జీఎమ్మార్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

 

Watch Video Here

NO COMMENTS

LEAVE A REPLY