ప‌ద్మ‌శ్రీ కోటా శ్రీనివాస‌రావును స‌న్నానించిన స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్

0
346

19285_10152938290346743_2485266282925174784_nస్టైలిష్ స్టార్, అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు.
ప్ర‌స్తుతం ఈచిత్రానికి సంభందించి ఫ్యామిలి స‌న్నివేశాలు కోకాపేట‌లోని హౌస్ సెట్ లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్ లో హీరో అల్లు అర్జున్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌,న‌టుడు ఉపేంద్ర‌, న‌టి స్నేహ మ‌రియు కోటా శ్రీనివాస‌రావు గారి పై స‌న్నివేవాలు షూట్ చేస్తున్నారు. అయితే భార‌త‌దేశ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇచ్చే ప‌ద్మ అవార్డుల‌లో ప‌ద్మ‌శ్రీ అవార్డు ని దాదాపు 30 సంవ‌త్స‌రాలుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని వైవిధ్యమైన పాత్ర‌లో అల‌రిస్తున్న విల‌క్ష‌ణ న‌టుడు శ్రీ కోటా శ్రీనివాస‌రావు గారికి ఇచ్చిన సందంర్భంలో హ‌రిక అండ్ హ‌సిని క్రియోష‌న్స్ చిత్ర యూనిట్ స‌భ్యులు మ‌ధ్య‌లో, హీరో అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌టుడు ఉపేంద్ర‌, న‌టి స్నేహ,  నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ, ఆర్ట్ డైర‌క్ట‌ర్ ర‌వీంద‌ర్  లు పాల్గోనగా కేక్ క‌ట్ చేసి సాలువా క‌ప్పి ప‌ద్మ‌శ్రీ కోటా శ్రీనివాస‌రావు  గారిని  స‌న్నానించారు.
ఈ సంద‌ర్భంగా ప‌ద్మ‌శ్రీ కోటా శ్రీనివాస‌రావు గారు మాట్లాడుతూ .. న‌టుడు గా నేను ఈ స్థాయికి వ‌చ్చానంటే అది నా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు,ర‌చ‌యిత‌లు, నా తోటి క‌ళాకారుల స‌పోర్టు మాత్ర‌మే. దర్శ‌కులు వారి వారి సృజ‌నాత్మ‌క‌మైన పాత్ర‌ల్లో న‌న్ను చూపించి తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల‌లో స్ధానం క‌ల్పించారు. ఎప్ప‌టికి న‌టుడుగానే వుండాల‌నేది నా కోరిక‌.  చివ‌రి  వ‌ర‌కూ న‌టిస్తూనే వుంటా. ఈ అవార్డు ని ఇచ్చిన కేంద్ర‌ప్ర‌భుత్వం వారికి నా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.. అని అన్నారు
ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధు తులాని,  ప‌ద్మ‌శ్రీ కోటా శ్రీనివాస‌రావు,వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు
సాంకేతిక వర్గం
ఆర్ట్ – రవీందర్,కెమెరా – ప్రసాద్ మూరెళ్ల,మ్యూజిక్  – దేవిశ్రీ ప్రసాద్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – పి.డి.ప్రసాద్,నిర్మాత – రాధాకృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – త్రివిక్రమ్ శ్రీనివాస్

NO COMMENTS

LEAVE A REPLY