ఎంహెచ్ 370 విమానం:ఓ చిన్న క్లూ దొరికింది..

0
297

 

MH370_flight

మలేషియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ 370  అదృశ్యమైన సంవత్సరం గడిచిన తర్వాత ఒక చిన్న క్లూ దొరికింది.  మంగళవారం ఆస్ట్రేలియా బీచ్లో  ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లాంటి  ప్యాకెట్  ఇప్పుడు కోటి ఆశలు  రేపుతోంది.   కింగ్ స్లే, విక్కీ మిల్లర్ అనే దంపతులకు    సెర్ వాంటెస్ బీచ్ తీరంలో  ఈ ప్యాకెట్ దొరకింది. దీని మీద మలేషియా ఎయిర్లైన్స్  లోగో స్పష్టంగా కనపడటంతో వెంటనే దీన్ని పోలీసులకు అప్పగించామని  వారు చెబుతున్నారు.

ఇన్ని వేల మైళ్లు  ప్రయాణం చేసి..ఇన్ని రోజుల తర్వాత కూడా  చెక్కు చెదరకుండా ఉన్న ఆ  ప్యాకెట్ మలేషియా ఎయిర్ లైన్స్కి సంబంధించిందే అయి వుంటుందని నిపుణులు అంటున్నారు.  కాగా 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎంహెచ్ 370 విమానం సరిగ్గా గత ఏడాది  మార్చిలో మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన 40 నిమిషాలకే  విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోవడం…. దాని ఆచూకీ నేటికీ లభించకపోవడం తెలిసిన విషయమే.

ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానంగా ఎంహెచ్ 370 ఓ మిస్టరీగా మిగిలిపోయింది.  ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు  కూడా ఉన్నారు.
తాజాగా దొరికిన  ఈ క్లూతో  అదృశ్యమైన వారి బంధువులు మాత్రమే కాదు…ప్రపంచం యావత్తు  ఎంహెచ్ 370 ఆచూకీ ఎప్పటికైనా దొరుకుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY