అలా పట్టుకోవాలి అంటే భయం వేసేది కాని ఇప్పుడు అలవాటైంది

0
445

kajal_agarwal_in_magadheera-normal

‘మగధీర’ మిత్రవింద కాజల్ అగర్వాల్ కు పక్షులంటే భయమటా. ముఖ్యంగా ప్రేమపక్షి పావురాన్ని చూస్తే ఇంకా బెదిరిపోతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ భయం పోయిందని కూడా ఈ ‘చందమామ’ సెలవిచ్చింది. ‘మారీ’ తమిళ సినిమా చేసిన తర్వాత పక్షులంటే భయం పోయిందని కాజల్ వెల్లడించింది. ఈ సినిమాలో చాలా పక్షులున్నాయని తెలిపింది.

సినిమా కోసం పక్షులను పట్టుకుని నటించాల్సి వచ్చిందని, మొదట్లో కాస్త భయం వేసినా తర్వాత అలవాటైందని వెల్లడించింది. ఇప్పుడు విహంగాలను చూస్తే అస్సలు భయం వేయడం లేదని అమ్మడు తెలిపింది. ‘మారీ’ సినిమాకు బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను శరత్ కుమార్, రాధిక నిర్మించారు.

NO COMMENTS

LEAVE A REPLY