జత బూట్లే ఉన్నాయి!

0
351

will smith

 

”నా కొడుకు జేడన్ స్మిత్ బీరువాలో జత బూట్లు, మూడు జతల ఫ్యాంట్లు, ఐదు చొక్కాలు మాత్రమే ఉన్నాయి. డబ్బుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉన్న నా కొడుకును చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది” అంటున్నాడు హాలీవుడ్ నటుడు విల్ స్మిత్. ఓ కార్యక్రమంలో విల్ స్మిత్ తన చిన్ననాటి సంగతులు, ప్రస్తుతం తన కొడుకు స్థితిగతుల గురించి మాట్లాడాడు. ”డబ్బుకు బానిస అవ్వడానికి నా కొడుకు ఇష్టపడటం లేదు. రాబోయే తరం ఇలా డబ్బు, వస్తువుల వ్యామోహంలో పడకుండా ఉండటం చూస్తే బాగుంది. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా రోజుల్లో బిల్లులు కట్టలేకపోవడంతో విద్యుత్తు, గ్యాస్ కనక్షన్లు తొలగించేవారు. దీంతో చలికాలంలో కిరోసిన్ హీటర్ల వేడి మధ్య బతికిన రోజులను మరచిపోలేను. కానీ నా కొడుకు దగ్గరకు వచ్చేసరికి మా స్థితిగతులు మెరుగయ్యాయి. అయినా భోగభాగ్యాలను నెత్తికెక్కించుకోకుండా సామాన్య వ్యక్తిలా ఉంటున్నాడు” అని ఆనందంగా చెప్పాడు విల్ స్మిత్.

NO COMMENTS

LEAVE A REPLY