omkara lingam

0
321

12310434_1024820954206281_3530984737155546271_nఓంకార లింగము :
ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాల్గవది “ఓంకార లింగము”. మధ్య భారతదేశమున మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఇండొర్ కు సుమారు 80కి . మీ దూరంలో “ఓంకారేశ్వర లింగము” ఉంది. దీనినే అమరేశ్వర లింగము అని కూడా అంటారు. పర్వతము లన్నిటి యందు ” మేరువు ” అను పర్వతము గొప్పది. మేరువు మీద మంగళ ప్రదుడైన శివమూర్తి ప్రమధగాణాలతో గౌరీ సామేతంగ నివసించియున్నాడు. వింధ్యుడు అనే పర్వత రాజుకు మేరువ రాజుకు ఉన్నంత గొప్పతనము పొందవలెనని సంకల్పముతో, “ఓం నమః శివాయ” మంత్ర జపం చేయుట మిన్నునంట ఎత్తు పెరుగుచుండును. దీనిని చూచిన అగస్త్యముని చేయి నడ్డుపెట్టి “వింధ్య రాజా! నేను కైలాసపతితో సంప్రదించి, నీకు ప్రసన్నుడగునట్లుగా చేయుదును. నీవు పెరగక నిలిచియుండు” అని చెప్పెను. అగస్త్య ముని పరమేశ్వరునితో “స్వామీ నీ అనుగ్రహమును సంపాదించుకోరి, వింధ్యా పర్వత రాజు మిన్నునంటగా పెరుగుచున్నాడు, అతని కోరికను ఫలింప జేయుము” అని ప్రార్ధించాడు. శంకరుడు వింధ్యునకు ప్రత్యక్షమై, వింధ్య పర్వతరాజు అభీష్టము అనుసరించి, ఆ పర్వతముపై సువర్ణ రూప లింగముగా వెలిశాడు. వింధ్యా చలమున, అమరేశ్వరమను చోట పృధ్వీశ్వరుడను పేరున వెలిసిన ఈ జ్యోతిర్లింగమును “ఓంకార లింగము” అందురు

NO COMMENTS

LEAVE A REPLY