ఒబామా కూతురా మజాకా

0
277

Malia

మలియా తెలుసా? పోనీ మలియా ఒబామా? హా.. మెదడులో ఓ మెరుపు మెరిసిందంటారా? అమెరికా అధ్యక్షుడి కూతురిగా కొంచెం పరిచయం ఉండే ఉంటుంది. తనీమధ్యే స్వీట్ సిక్స్‌టీన్ దాటింది. ఎన్నాళ్లని తండ్రిచాటు బిడ్డలా ఉండటం అనుకుందేమో.. సొంతంగా పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది మలియా. ఫ్యాషన్లకు చిరునామాగా నిలిచే ప్రొ-ఎరా అనే డిజైనర్ టీషర్ట్ తొడుక్కొని కొంటెగా చూస్తూ ఫొటోలు దిగింది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఎంతైనా ఒబామా కూతురు, టీనేజీ అమ్మాయి.. ఆమె అందాన్ని పొగుడుతూ ఒకటే కామెంట్లు. అన్నట్టు దెబ్బకి ప్రొ-ఎరా అమ్మకాలు కూడా వూపందుకున్నాయిట. దగ్గరి స్నేహితుడు తన ఫొటోల్ని ఆన్‌లైన్‌లో పెట్టేశాడని మలియా అంటున్నా కావాలనే తనలా చేసిందనే గుసగుసలూ వినపడుతున్నాయి

NO COMMENTS

LEAVE A REPLY