“ఎన్టీఆర్” అంటే పిచ్చి అంటున్న”అలియా భట్”

0
399

Alia-Bhatt-Desires-To-Romance-Jr-NTR

ఎన్టీఆర్ అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. తెలుగు అమ్మాయిల నుంచి నందమూరి ఫ్యాన్స్ వరకు అందరికీ తారక్ అంటే పిచ్చి అభిమానం, ప్రేమ. యంగ్ టైగర్ తో ఫొటో దిగాలని అభిమానులు కోరుకుంటారు. ఇదిగో అలాంటి ఓ ఫాంటసీ కలనే కంటోంది బాలీవుడ్ భామ అలియా భట్. ఎన్టీఆర్ అంటే తనకు పిచ్చి అంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ అలియాభట్. ఈమెకి ఎన్టీఆర్ అంటే తెగ ఇష్టమట. ఎన్టీఆర్ డాన్స్ అన్నా.. స్క్రీన్ పై ఆయన చలాకీతనం అన్నా చాలా ఇష్టమని చెప్పుకొస్తోంది. అంతేకాదు.. కుదిరితే యంగ్ టైగర్ తో డేటింగ్ కి కూడా సిద్ధమని ప్రకటించింది.ఏదేమైనా ఈ వార్త విని తారక్ మాత్రం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక పెద్దగా నవ్వేశాడట.

NO COMMENTS

LEAVE A REPLY