ఎయిడ్స్తో చావుబతుకుల మధ్య ఒకప్పటి హీరోయిన్!

0
239

51417707541_625x300

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్‌లతో నటించిన నటి నిషా ఎయిడ్స్ కోరలో చిక్కుకుని మరణపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈమె దుస్థితి తెలిసి తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. బాలచంద్రన్, విశు, చంద్రశేఖర్‌ వంటి ప్రముఖుఏల దర్శకత్వంలో ఆమె నటించారు. నిషా కమలహాసన్ సరసన టిక్ టిక్ టిక్ చిత్రంలోను, రజనీకాంత్‌తో రాఘవేంద్ర చిత్రంలోను నటించారు. ఇంకా కల్యాణ అగధిగళ్, మయిలుక్కు మూనుకాల్ మొదలగు పలు చిత్రాలలో కథా నాయకిగా నటించారు.

నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎయిడ్స్ రోగంతో బాదపడుతున్న ఫోటోలు ఇటీవల వాట్సాప్, సామాజిక వెబ్ సైట్‌లలో ప్రచారం అయ్యాయి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అస్థి పంజరం లాంటి దేహంతో నాబూర్ దర్గా సమీపంలో వారం రోజులుగా అనాథగా పడి వున్న నటి నిషాను  పట్టించుకున్నవారులేరు. ఆమె శరీరంనిండా చీమలు, ఈగలు ముసిరి ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం సినిమాలో కథానాయికగా ప్రకాశించిన నటి నిషా దయనీయ స్థితిని తెలియజేస్తూ, ఫోటోలతో సహా ఒక మెస్సేజ్ జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు న్యాయమూర్తి మురుగేశన్కు అందింది.

ఆ దృశ్యాలు ఆయన మనసును కలచి వేశాయి.  వెంటనే ఆయన స్పందించారు.   నిషాకు వెంటనే వైద్య చికిత్సలకు ఏర్పాటు చేయాల్సిందిగా నాగపట్టణం జిల్లా కలెక్టర్‌ని, పోలీసు సూపరింటెండెంట్ని ఆదేశించారు.  ఆమె ఆరోగ్య వివరాలను నాలుగు వారాల్లోగా అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY