వాళ్ళ పక్కన మేము కుర్చోము అంటున్న MP లు……

0
286

Parliament

అసలే పార్లమెంట్ లో MP లకు ప్రజా సమస్యల పై చర్చించుకొనే సమయమే లేకుoడా పోతుంటే మళ్ళి ఇదొకటా అంటున్నారు ప్రజలు. ఇప్పటికే పార్లమెంట్ ని ఎన్ని రకాలుగా అవమాన పరచాలో అన్ని రకాలుగా అవమాన్పరిచి భారత పార్లమెంట్ అంటే శాసనాలు చేయడానికి, బిల్ల్లులు పాస్ చేయడానికి, ప్రజా సమస్యలు చర్చించటానికి కాదు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోడానికి, డబ్బు తీసుకొని ప్రశ్నలు అడగడానికి, ఎవరైనా ఆందోళన చేస్తే పెప్పర్ స్ప్రే చల్లడానికి అని ఇలా ప్రపంచo ముందు భారతదేశాన్ని ఎన్ని విధాలుగా పరువు తీయాలో అన్ని విధాలుగా తీసి ఇప్పుడు ఇదొకటి. అసలే ప్రస్తుత పార్లమెంట్ లో విపక్ష నేత విషయంలో గందరగోళం వుంటే ఇప్పుడు కొత్తగా అన్నా డి.యం.కే, తృణముల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ MP లు కాంగ్రెస్ యం.పి ల పక్కన మేము కుర్చోము అని కొత్త పల్లవి అందుకొన్నారు. ప్రస్తుత సభలో అన్నా డి.యం.కే కి 37, తృణముల్ కాంగ్రెస్ కి 34, బిజు జనతాదళ్ కి 20 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ కి 44 మంది సభ్యుల బలం ఉంది. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేని పార్టీ పక్కన తమని కుర్చోమంటార అని మిగిలిన యం.పి లు గోల చేస్తున్నారు. తమ నియోజికవర్గాలకి నిధులు తెప్పించుకొనే విషయంలో గొడవ పడితే తప్పు లేదు కానీ కూర్చునే విషయంలో ఏంటి చండాలంగా……

NO COMMENTS

LEAVE A REPLY