” నేతాజీ ” విషయంలో కళ్ళు తెరచిన ప్రభుత్వం

0
220

3

భారత స్వాతంత్ర సమరంలో ఎందరో అమర వీరులు  అసువులు బాసారు.. వారిలో ” నేతాజీ సుబాష్ చంద్రబోస్ ”  ఎంతో మందికి ఆదర్సదాయకం., అయితే అప్పుడు ఉన్న  కుళ్ళు రాజకీయాల వల్ల  దేశ ద్రోహులకు, తెల్ల దొరలకు చుక్కలు చూపించిన  బోస్ అనుమానాస్పద స్థితిలో  మరణించారు.. ఆయన మరణం వెనక ఎంతో మిస్టరీ ఉంది. ఎంత మంది దాన్ని తవ్వడానికి ప్రయత్నించినా అది బయటకి రాకుండా సమాధి అయిపొయింది.. బోస్ పట్ల ఎంత మందికో వ్యతిరేక భావం ఉండేది.. పైగా గాంధీజీ మరియు నెహ్రు ఎదుగుదలకి బోస్ అడ్డుగా ఉన్నందున ఆయనని చంపించారన్న వార్తలు ఉన్నాయి.. 

కాంగ్రెస్ ప్రభుత్వం బోస్ ని ఏ నాడు గౌరవించలేదు.. అమర వీరులను పక్కన పెట్టి , ఇందిరా గాంధీ , రాజేవ్ గాంధీ లకు ప్రాధాన్యం ఇచ్చారు.. బిజెపి ప్రభుత్వం మాత్రం ఇప్పటికి కళ్ళు తెరిచింది.. బోస్ కి మరియు వాళ్ళ ఒకప్పటి అగ్ర నేత ” అటల్ బిహారి వాజపేయ్” కి  భారత అత్యున్నత పురస్కారం అయిన ” భారత రత్న ” ని ఇవ్వాలి అనుకుంటున్నట్టు సమాచారం.. దీనికోసం 5 భారత రత్న మెడల్స్ రిజర్వు బ్యాంకు నుండి ఆర్డర్ చేశారని అంటున్నారు.. దీనిని ఒక బిజెపి నేత కొట్టి పారేసారు .. మరో వైపు కాంగ్రెస్ పెద్దలు వాజపేయ్ గురించి కామెంట్ చేయడానికి నిరాకరించారు.. అయితే బోస్ కి మాత్రం ఆ సత్కారం సమంజసమే అని , అయన అండమాన్ దీవులకి విముక్తి కలిపించారు కాబట్టి ..దానికి అయన పేరు పెట్టాలని అన్నారు ..

ఇది ఇలా ఉండగా .. బోస్ కుటుంబ సభ్యులు మాత్రం దీని గురించి అంత హర్షం వ్యక్తం చేయలేదు. ఆయన కుటుంబ సభ్యుడు సుగాతో బోస్ దీనిని కొట్టి పారేశారు.. ఆ వార్తలు నిజం కావని , ఒకవేళ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే , భారత రత్న ఇచ్చే ముందు ” సుబాష్ చంద్రబోస్ ” ఎలా మాయం అయ్యారో తెలియచేయాలని అన్నారు.. మరి మోడీ ప్రభుత్వం ఎం చేస్తుందో ..చూడాల్సిందే…

b6ac1866408a180a6c75f37d0d937741_L

NO COMMENTS

LEAVE A REPLY