నందమూరి హరికృష్ణ కుమారుడు “జానకిరామ్” మృతి

0
299

newpg-100days-athano75

నల్గొండ: జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రెండో కుమారుడు జానకిరామ్ మృతిచెందాడు. అతని ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పడంతో జానకిరాం  మృత్యువాత పడ్డాడు. అతను గాయపడిన అనంతరం హుటాహుటీనా కోదాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో అతను ప్రయాణిస్తున్న టాటా సఫారీ బోల్తా పడింది.  హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటూ తన తమ్ముడు కల్యాణ్ రామ్ కు సంబంధించిన సినీ వ్యవహారాల్లో జానకీ రామ్ క్రియాశీలక పాత్ర పోషించే వాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు నిర్మాతగా ఉన్న జానకీరామ్ మృతిపట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. జానకీరామ్ ఆకస్మిక మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY