” చైతు ” కధ లో వేలు పెట్టిన ” నాగార్జున “

0
192

9992-Nag-Chaitanya

 

ఈమ‌ధ్య నాన్న‌ల ప్ర‌మేయం బాగా ఎక్కువైపోయింది. వార‌సుడి సినిమా అంటే ద‌ర్శ‌కులు త‌ల‌లు ప‌ట్టుకొంటున్నారు. సినిమా ఇలా తీయండి, అలా తీయండి అని చెప్ప‌డ‌మే కాదు, పూర్త‌య్యాక ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూడా హీరో తండ్రులు త‌మ హ‌వా చూపిస్తున్నారు. నాగ‌చైత‌న్య సినిమా విష‌యంలోనూ నాగార్జున  విప‌రీతంగా జోక్యం చేసుకొంటున్నార‌ని,  ఒక లైలా కోసం  సినిమాలో నాగ్ వేలు పెట్టార‌ని, ఆయ‌న సూచ‌న‌ల మేర‌కే రీషూట్ కూడా జ‌రిగింద‌ని వార్త‌లొచ్చాయి. వాటిపై నాగ‌చైత‌న్య క్లారిటీ ఇచ్చారు. `”సినిమా పూర్త‌య్యాక నాన్న‌గారికి చూపించాం. ఆయ‌న సినిమా చూసి రెండు మూడు మార్పులు చెప్పిన మాట వాస్త‌వ‌మే. మేం కూడా కొన్ని స‌న్నివేశాల్ని రీషూట్ చేశాం. రెండు మూడు రోజులు ప‌ట్టిందంతే. అయితే నాన్న‌గారి స‌ల‌హాలు బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. మా సినిమా మ‌రింత బాగా రావ‌డానికి దోహ‌దం చేశాయి” అని చెప్పుకొచ్చాడు చైత‌న్య‌.

NO COMMENTS

LEAVE A REPLY