భక్తి మార్గం లోకి నాగార్జున

0
368

nagarjuna-santosham

నాగార్జున – కె.రాఘవేంద్రరావు… తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన కలయిక ఇది. మాస్‌ను మైమరపించారు. అదే ప్రేక్షకుల్ని భక్తిసాగరంలో ముంచెత్తారు. ‘జానకీరాముడు’, ‘ఆఖరి పోరాటం’, ‘ఘరానా బుల్లోడు’.. ఇవన్నీ ఒక ఎత్తు. ‘అన్నమయ్య’ మరో ఎత్తు. అక్కడి నుంచి వీళ్ల ఆలోచనలు మారిపోయాయి. ‘శ్రీరామదాసు’, ‘శిరిడీసాయి’ లాంటి ఉత్తమ చిత్రాల్ని అందించారు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి మురిపించడానికి సిద్ధమయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే ఇది ‘అన్నమయ్య’లాంటి ఆధ్యాత్మిక భావాలున్న చిత్రమా? లేదంటే ఈసారి పూర్తి వాణిజ్య విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తారా అనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి

NO COMMENTS

LEAVE A REPLY