ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూత

0
288

ms narayana

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. జనవరి 19న భీమవరంలో అస్వస్థతకు గురైనా ఆయనను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎంఎస్ నారాయణ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. 1951 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించిన ఆయన పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. సినిరంగంలోకి రాకముందు పశ్చిమగోదావరి జిల్లాలోని కె.జి.ఆర్ కళాశాలలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఎం.ఎస్‌కు భార్య కళాప్రపూర్ణ, ఇద్దరు పిల్లలు శశికిరణ్, విక్రమ్ ఉన్నారు.
ఐదు నంది అవార్డులు అందుకున్న ఎం.ఎస్
ఎం.ఎస్ నారాయణ నటించిన నవాబ్ బాషా, శుభోదయం, క్రేజీవాలా చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఉత్తమ సహాయ నటుడిగా దూకుడు చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఎం.ఎస్ నారాయణ 5నంది అవార్డులు, 2 సినీ గోయెర్స్ అవార్డులు అందుకున్నారు. మా నాన్నకు పెళ్లి, రామసక్కనోడు, సర్దుకుపోదాం రండి, శివమణి, దూకుడు… చిత్రాల్లో ఆయన నటనకు నంది అవార్డులు లభించాయి.

NO COMMENTS

LEAVE A REPLY