కూతుళ్ళపై రేప్ లను ప్రోత్సహించిన తల్లి….

0
255

Rape-Incidentsమానవత్వం.., తల్లి ప్రేమ మంటగలిసిన దుర్ఘటన ఇది. కూతురిపై ఇతరుల కన్ను పడిందంటే.., వారి కళ్ళు పీకేందుకు కూడా తల్లి వెనకాడదు. అయితే ఈ తల్లి మాత్రం కామంతో కళ్ళు మూసుకుపోయి కూతుళ్ళపై అత్యాచారానికి సహకరించింది. అదికూడా తనతో సంబందం పెట్టుకున్న వ్యక్తి కోసం.., ఈ దారుణ ఘటన మేడ్చల్ లో జరిగింది. పోలిసుల వివరాల ప్రకారం, పట్టణంలోని కింది బస్తీలో శశికళ అనే మహిళ నివసిస్తోంది. ఓ హోటల్ లో పనిచేసే చంద్ర శశికళను పెళ్లఇ చేసుకున్నాడు. వయసురిత్యా శశికళ కంటే చంద్ర చాలా చిన్నవాడని తెలుస్తోంది.

కొన్నాళ్లు వీరి వ్యవహారం సాగిన తర్వాత.., శశికళ వయసు అయిపోతుందనీ.., ఆమె పెద్ద కూతురిపై కన్నేశాడు. యువతిపై పలుమార్లు అత్యాచారం కూడా జరిపాడు. ఇందుకు తల్లి కూడా సహకరించటంతో.., ఆ అమ్మాయి ఏమి చేయలేకపోయింది. కామాంధుడి అఘాయిత్యానికి ఫలితంగా గర్భం దాల్చింది. అంతటితో ఆగకుండా శశికళ చిన్న కూతురిపై కూడా కన్నేసిన చంద్ర ఆమెపై కూడా అత్యాచారానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలిసులు చంద్రను అరెస్టు చేశారు. అటు తల్లి కూడా నిందితుడికి సహకరించిందని తెలిసి ఆమెను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.

 

NO COMMENTS

LEAVE A REPLY