మోడీని ప్రశ్నించబోతున్న పవన్ ?

0
325

pawan-ndtv

చార్జీల పెంపుని తగ్గిస్తారు అని ప్రజలు ఎంతో ఆశగా మోడీ సర్కారుని గెలిపించారు .. అయితే ప్రభుత్వం మొదట పెట్రోలు రేట్ పెంచింది, అది తక్కువే కదా అని అందరు ఊరుకున్నారు..అయితే ఈసారి ప్రభుత్వం ప్రజల మీద పెద్ద భారంనే వేసింది. రైలు చార్జీలను పెంచి కొండంత భారంని సామాన్య మానవుడిపై మోపింది. పాసెంజర్ చార్జీలు 14.2 % మరియు ఫ్రైట్ చార్జీలు 6.5% పెంచింది. దీనిపై ప్రజలు లబోదిబో అంటున్నారు.

ఎన్నికలకు ముందు తమకి తోడుగా ఉంటాను అని మాట ఇచ్చిన పవర్ స్టార్ పవన్ మీద జనం ఆశలు పెట్టుకున్నారు. తప్పు చేస్తే ఎవరినన్నా ప్రశ్నిస్తా అన్న పవన్… తెలంగాణా లో టీవీ చానల్స్ అపెసినందుకు కెసిఆర్ ని నిలదీశాడు. ఎన్నికల ప్రచారంలో మోడీ మీద ఈగ కూడా వాలనివ్వను అన్న పవన్  ఇప్పుడు ధరల విషయంపై  ఆయన్ని నిలదేస్తారో లేదో చూడాల్సిందే…..

NO COMMENTS

LEAVE A REPLY