భహిరంగ సవాల్ విసిరిన మోడీ

0
350

narendra-modi-feb-1

భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలెంజ్ విసిరారు. అయితే ఆయన విసిరింది ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ కాదు. స్వచ్చ భారత్ చాలెంజ్. తాజాగా స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా మోడీ పలువురు ప్రముఖులకు చాలెంజ్ విసిరారు. బహిరంగ ప్రదేశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొనాలని మోడీ తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు.

న్యూఢిల్లీలో స్వచ్చభారత్ లో పాల్గొన్న మోడీ ఆ తొమ్మిది మందికి ఆహ్వానం పలికారు.. ఆ తొమ్మిది మంది మరో తొమ్మిది మందికి ఆహ్వానించాలని.. మోడీ విజ్ఞప్తి చేశారు. మోడీ ఆహ్వానించిన వారిలో నటులు సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, కమల్ హాసన్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శశిధరూర్, తారక్ మెహత, అనిల్ అంబాని, మృదులా సిన్హా, యోగా గురువు బాబా రాందేవ్ లు ఉన్నారు. వీరందరూ బహిరంగ ప్రదేశాలలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనాలని మోడీ ఆహ్వానించారు. మొత్తానికి మోడీ విసిరిన చాలెంజ్ ఇండియాలో ఇప్పుడు పాపులర్ కానుంది.

NO COMMENTS

LEAVE A REPLY