ఒబామా బార్య మిషెల్ ముఖాన్ని బ్లర్ చేసి చూపించారు?

0
446

michelle_obama_saudi_ll

భారతదేశ పర్యటన ముగించుకుని సౌదిఅరేబియా వెళ్ళిన అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా బార్య మిషెల్ … తన దుస్తులు తీరును కొంతవరకు మార్చుకున్నారు. ఇక్కడ పొట్టి గౌన్లుతో కనబడిన ఆమె అక్కడ పొడుగాటి ప్యాంట్లు కూడా ధరించారు. అయినా కూడా బురకా లేదన్న కారణంతో ఆమె ముఖాన్ని సౌదిఅరేబియా అధికారిక ఛానల్లో బ్లర్ చేసి చూపించారని పెద్దవివాదం రేగింది.అయితే ఆ ఆరోపణలు అవాస్తవమని , వాస్తవాలు చూడాలి తప్ప ఫేస్బుక్ వివాదాల మీద ఆదారపడ వద్దని  సౌది ఎంబసి ట్వీట్ చేసింది.

వాస్తవానికి యుట్యుబ్ లో పోస్ట్ చేసిన క్లిప్పింగులలో సౌదిఅరేబియా టీవీ మిషెల్ ముఖాన్ని బ్లర్ చేసి చుస్పించినట్లు ఉంది.అయితే ప్రత్యక్ష ప్రసారం చూసిన వాళ్ళు అదేమీ లేదని చెబుతున్నారు. దాంతో ఇపుడు ఇదంతా పెద్ద వివాదంగా మారింది.

NO COMMENTS

LEAVE A REPLY