ప్రేమలో పడ్డాను అనుకుంటా

0
388

shraddha-kapoor-grazia-magazine-images5

మీరు ప్రేమలో పడ్డారట? అని ఏ కథానాయికను అడిగినా..అబ్బే అలాంటిదేం లేదు అంటారు. మరింత గుచ్చిగుచ్చి అడిగితే మామూలు స్నేహితుడే అనేస్తారు. నిన్న మొన్నటిదాకా బాలీవుడ్ నాయిక శ్రద్ధాకపూర్‌ది ఇదే తీరు. ఆదిత్యరాయ్ కపూర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూనే మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అని చెప్పేసేది. ‘ఆషికీ2’ చిత్రంతో ఈ జంట ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని వార్తలు వచ్చినా ఇద్దరూ వాటిని కొట్టిపారేస్తూనే ఉన్నారు. ప్రేమ కథ సుఖాంతం అయ్యే సమయం ఆసన్నమైందో ఏంటో ఈ భామ మనసులో మాట కొంచెం బయటపెట్టింది. ప్రియుడి పేరు చెప్పలేదు కానీ ప్రేమలో ఉన్నానని అంగీకరించింది. ”నాకు చాలా ఉద్విగ్నంగా ఉంది. ఎందుకంటే బహుశా నేను ప్రేమలో పడ్డానేమో” అంటూ ట్వీట్ చేసింది. ఈ మధ్యే ఆదిత్యరాయ్ కపూర్‌ను కశ్మీర్‌లో ‘ఫితూర్’ సినిమా సెట్లో ప్రత్యేకంగా కలిసినట్లు సమాచారం. అనుష్కశర్మ, విరాట్‌కోహ్లిలు తమ ప్రేమ కథను బాహాటంగా ప్రకటించారు. అందుకేనేమో శ్రద్ధా కూడా ధైర్యం చేసి మనసులో మాట బయటపెట్టేసింది. ఈ ఏడాది ‘హైదర్’, ‘ఏక్ విలన్’తో మంచి విజయాల్ని అందుకొంది శ్రద్ధ.

NO COMMENTS

LEAVE A REPLY