మా టి.విని కైవసం చేసుకొన్న ప్రముఖ ఛానల్

0
437

maa_tv

ప్రముఖ తెలుగు టి.వి మరియు మీడియా సంస్థ అయిన మా టి.వి ని భారతదేశంలోనే అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ అయిన స్టార్ ఇండియా హస్తగతం చేసుకొంది. ప్రస్తుతం మా టెలివిజన్ నెట్వర్క్ లో వున్న నాలుగు చానల్స్ – మా టి.వి, మా మ్యూజిక్, మా గోల్డ్, మా మూవీస్ స్టార్ ఇండియా నెట్వర్క్ క్రిందకు రానున్నాయి. ఈ రోజు మా సంస్థ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మరియు డైరెక్టర్స్ అయిన చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్లతో స్టార్ ఇండియా సిఇఓ అయిన ఉదయ శంకర్ జరిపిన చర్చలతో విజయవంతం అయ్యాయి. దిని గురించి ఉదయ శంకర్ తెలుపుతూ “ స్టార్ ఇండియా మా నెట్వర్క్ కి సంభందించిన అన్ని హక్కులను కైవసం చేసుకోనుంది. అన్ని అనుమతులు పూర్తి అయిన తరువాత మా టి.వి స్టార్ ఇండియాలో భాగం కానుంది”. ఇప్పటివరకు స్టార్ ఇండియా పోర్ట్ఫోలియో లో తెలుగు ఛానల్ లేదు ఇప్పుడు “మా” చేరికతో ఆ లోటు భర్తీ కానుంది. ఈ డీల్ ఖరీదు ఎంతో చెప్పడానికి ఉదయ శంకర్ నిరాకరించారు.

NO COMMENTS

LEAVE A REPLY