lost mobile phone

0
452

download (1)

ఫోన్ పోయిందా? ట్రాక్ చేయండిలా…!
సైట్లన్నీ వెతికి, ఫీచర్ల గురించి కనుక్కుని ఎంతో ఇష్టంగా
కొన్న ఖరీదైన ఫోన్ ఎక్కడో పోతే…? బాధపడుతూ కూర్చోవాల్సిన పని
లేదు. ఏ స్థలంలో మరిచిపోయారో, ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడుందో
క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఎవరి చేతుల్లో ఉందో వారి ఫోటోలు
కూడా సంపాదించొచ్చు. మర్యాదగా ఫోన్ తెచ్చి అప్పగిస్తావా లేక నీ
ఫోటో పోలీసులకు ఇవ్వమంటావా అని మెసేజ్ పెట్టొచ్చు. మీది
ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక
ఇది సాధ్యమే. ఎలాగో చదవండి.
మాదాపూర్‌లో ఉండే రవి ఫ్లిప్‌కార్ట్‌లో ఇటీవలే కొత్త స్మార్ట్‌ఫోన్
కొన్నాడు. ఆకట్టుకునే లుక్, అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఆ ఫోన్
చూసిన తన స్నేహితులు సైతం సూపర్ ఫోన్ అన్నారు.
ఆండ్రాయిడ్ లాలిపాప్‌తో వచ్చిన ఆ ఫోన్ రవికి తెగ నచ్చేసింది. కానీ అది
మూన్నాళ్ల ముచ్చటే అయింది. సెలవు రోజున సూపర్‌మార్కెట్
కు వెళ్లిన రవి ఫోన్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆ రోజు
విపరీతమైన జనం. ఫోన్ ఎవరికి దొరికిందో తెలియదు. వెంటనే ఫోన్
చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దాంతో రవి దిగాలుగా మారిపోయాడు.
ఎంతో ఇష్టపడి కొన్న ఫోన్ నెల రోజులు కాకముందే పోవడంతో బాగా
బాధపడ్డాడు.
రవి స్మార్ట్‌ఫోన్ అయితే కొన్నాడు కానీ, యాంటీ థెఫ్ట్ యాప్స్ మాత్రం
ఇన్స్టాల్ చేసుకోలేదు. దానివల్ల ఖరీదైన ఫోన్ ఎక్కడ పోయిందో
కనుక్కోలేకపోయాడు. ఒకవేళ తను యాంటీథెప్ట్ యాప్స్ ఇన్స్టాల్
చేసుకుని ఉంటే తన ఫోన్ సులభంగా దొరికేది. ఫోన్ పోతే వెతికిపెట్టే
యాప్స్ ఇప్పుడు చాలానే ఉన్నాయి.
గాట్యా!
మీ డివైజ్‌కు పర్ఫెక్ట్ సెక్యూరిటీ కావాలంటే ఈ యాప్‌ని
ఎంచుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌ను ఎవరైనా తస్కరించి స్ర్కీన్లాక్ని
తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వారి
ఫోటోలను సైలెంట్‌గా తీసి మీ రిజిస్టర్డ్ మెయిల్‌కు పంపిస్తుంది.
ఫోన్ ఏ లొకేషన్లో ఉందో గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. ఆ
లింక్‌ను మెయిల్ చేస్తుంది. ఫోన్ మీరున్న ప్రదేశానికి దగ్గరలోనే
ఉందని తెలిస్తే సైలెంట్లో ఉన్నా బిగ్గరగా అలారం సౌండ్ వచ్చేలా
చేయవచ్చు. దీంతో ఫోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది. డివైజ్ లాక్/
అన్‌లాక్, కాల్‌బ్యాక్ రిక్వెస్ట్, సిమ్ చేంజ్ నోటిఫికేషన్, మెసేజ్ డిస్ప్లే
వంటి ఫీచర్లు అదనం.
వేర్ అవేర్
ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మరిచిపోతుంటారా? అయితే ఈ వాచ్
మీరు ధరించాల్సిందే. ఈ వాచ్ ఉంటే ఫోన్ మరిచిపోయే ప్రసక్తే
ఉండదు. ఫోన్ మీ వెంట లేకపోతే ఈ ఆండ్రాయిడ్ వేర్ వాచ్
మిమ్మల్ని హెచ్చరిస్తుంది. వాచ్, స్మార్ట్‌ఫోన్‌కు మధ్య సిగ్నల్స్
అనుసంధానం అవుతుంటాయి. ఒకవేళ ఈ రెండింటి మధ్య
సిగ్నల్స్ లేకపోతే వైబ్రేషన్స్‌తో హెచ్చరిస్తుంది. సింపుల్‌గా
ఉంటుంది. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
సెర్బెరస్ యాంటీథెఫ్ట్
పోయిన ఫోన్‌ను రికవరీ చేయడానికి ఉపయోగపడే బెస్ట్ యాంటీథెఫ్ట్
యాప్ ఇది. ఫోన్ ఎక్కడుందో కనిపెట్టడానికి బాగా ఉపకరిస్తుంది.
ఫోన్లోని డాటాను రిమోట్‌గా పొందవచ్చు. సెర్బెరస్ వెబ్సైట్లోకి వెళ్లి
రిమోట్‌గా డాటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ లొకేషన్లో ఉందో ట్రాక్
చేయవచ్చు. కోడ్‌తో డివైజ్‌ను పర్మనెంట్ లాక్ చేయవచ్చు. ఫోన్‌ను
ఎవరు ఉపయోగిస్తున్నారో, వారి ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
వారు చదివేలా స్ర్కీన్‌పై మెసేజ్ డిస్ప్లే అయ్యేలా చేయవచ్చు.
మైక్రోఫోన్ సహాయంతో కాల్ డాటాను రికార్డు చేసుకోవచ్చు.
ఇంటర్నల్, ఎస్డీకార్డులో డాటాను డిలీట్ చేయొచ్చు. లాస్ట్కాల్
ఎవరికి చేశారో తెలుసుకోవచ్చు. మొత్తంగా ఈ ఫీచర్స్‌తో పోయిన
ఫోన్‌ను కనిపెట్టడం చాలా సులువు.
అవాస్ట్
ఇందులోనూ దాదాపుగా అవే ఫీచర్స్ ఉంటాయి. రిమోట్‌గా డాటాను
తొలగించుకోవచ్చు. ఫోన్ ఎవరిచేతుల్లో ఉందో వారి ఫోటోలు
తీసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల వాయిస్‌ని వినొచ్చు. జీపీఎస్
సహాయంతో ఏ ప్రదేశంలో ఉన్నారో లొకేట్ చేయొచ్చు. టెక్ట్స్ మెసేజ్
పంపించి ఫోన్ లాక్ అయ్యేలా చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్
గూగుల్ అందిస్తున్న యాప్ ఇది. లాస్ట్ ఫోన్‌ను లొకేట్ చేయడానికి
ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డివైజ్‌లో ఉన్న డాటా ఇతరుల
చేతుల్లో పడకుండా కాపాడుకోవచ్చు. గూగుల్ అకౌంట్
సహాయంతో ఆండ్రాయిడ్ డివైజ్‌ను లొకేట్ చేయవచ్చు. స్ర్కీన్
లాక్పిన్ను రీసెట్ చేసుకోవచ్చు. కావాలంటే డాటా మొత్తం
తుడిచేయవచ్చు.
ఫైండ్ మై ఆండ్రాయిడ్ ఫోన్
ఫోన్ లొకేషన్ రియల్ టైమ్ అప్డేట్ని అందిస్తుంది. ఫోన్ ఉన్న
వ్యక్తి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి
మారుతున్నట్లయితే వెంటనే చూపిస్తుంది. దీంతో స్టోలెన్
ఫోన్‌ను గుర్తించడం ఈజీ అవుతుంది. ఫైండ్ మై
ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్సైట్ ఇన్‌స్టంట్‌గా లొకేషన్ అప్డేట్ని
పొందవచ్చు.
ఫైండ్ మై ఫోన్ (ఆండ్రాయిడ్ వేర్)
ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్ మాదిరిగానే ఈ యాప్ ఫోన్‌కు దూరంగా
వెళితే అలర్ట్ చేస్తుంది. అలారం వచ్చేలా సెట్ చేసుకోవచ్చు.
ప్రె యాంటీథెఫ్ట్
జియోలొకేషన్ ఫీచర్‌తో పోయిన ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
జీపీఎస్, వైఫై ట్రయాంగులేషన్తో ఫోన్ ఎక్కడుందో మ్యాప్‌లో
గుర్తించవచ్చు. గాట్యా మాదిరిగానే ఇందులోనూ ఫోటో ట్రిక్
ఉపకరిస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రేర్ కెమెరాతో రిమోట్‌గా
ఫోటోలు తీసి పొందవచ్చు. ఇతరులు ఓపెన్ చేయకుండా రిమోట్‌గా
లాక్ చేయవచ్చు.
యాంటీ థెఫ్ట్ అలారం
టూర్స్‌కు వెళ్లినపుడు, ప్రయాణాల్లోనూ సౌలభ్యాన్ని బట్టి
చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో ఫోన్‌ను
కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. అలాకాకుండా మొబైల్లో
యాంటీథెప్ట్అలారం ఇన్స్టాల్ చేసి ఆన్ చేసినట్లయితే ఎవరైనా ఫోన్
చార్జింగ్ నుంచి తీస్తే పెద్ద శబ్ధం చేస్తుంది.
అంతేకాకుండా ఫోన్ లాక్ అవుతుంది. అలారం శబ్ధాన్ని ఎట్టి
పరిస్థితుల్లోనూ ఫోన్‌ను తస్కరించిన వ్యక్తి ఆపలేడు. పిన్
ఎంటర్ చేయడం ద్వారా మీరు మాత్రమే ఆపగలుగుతారు. ఫోన్‌ను
ఎవరైనా తీస్తారేమోననే భయం ఉండదు.
లుకవుట్
ఇది అద్భుతమైన యాప్. ఫోన్‌ను ట్రాక్ చేయడానికి బాగా
ఉపకరిస్తుంది. చేయాల్సిందల్లా యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోవడమే.
కాంటాక్ట్స్, ఫోటోలు బ్యాకప్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫోన్
పోయినట్లయితే మరొక స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్లో నుంచి
లుక్అవుట్ అకౌంట్లోకి లాగిన్ అయి మిస్‌ప్లేస్ అయిన ఫోన్‌ను ట్రాక్
చేయవచ్చు. ఈ యాప్‌లో కొన్ని ముఖ్యమైన ఫంక్షన్స్ ఉన్నాయి.
అవి లొకేట్, స్ర్కీమ్, సిగ్నల్ ఫ్లేర్, లాక్ కామ్. లుక్అవుట్
అకౌంట్లోకి యూజర్ లాగిన్ అయిన తరువాత ఈ ఆప్షన్‌ను
యాక్టివేట్ చేయవచ్చు. వెంటనే ఫోన్‌ను ట్రాక్ చేసి అది ఉన్న
ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. పోగొట్టుకున్న
డివైజ్ ఏ లొకేషన్లో ఉందో తెలియజేస్తూ మెయిల్ కూడా వస్తుంది.
మొబైల్ ఎక్కడ ఉందో తెలియజేసేందుకు స్ర్కీమ్ ఫీచర్ పెద్దగా
అలారం సౌండ్ చేస్తుంది. ఒకవేళ ఫోన్ బ్యాటరీ పూర్తిగా డౌన్
అయిపోతే కనుక్కోవడం కష్టంగా మారుతుంది. ఆ సమయంలో
సిగ్నల్ ఫ్లేర్ ఫీచర్ ఉపయోగపడుతుంది. బ్యాటరీ డెడ్
అవుతున్నట్లయితే లుక్ అవుట్ అప్లికేషన్ ఆటోమెటిక్‌గా చివరగా
ట్రేస్ చేసిన లోకేషన్‌ను అకౌంట్లో సేవ్ చేస్తుంది. ఫోన్‌ను అన్‌లాక్
చేసేందుకు ప్రయత్నించి, మూడు సార్లు విఫలమైతే
స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కెమెరా ఆటోమెటిక్‌గా ఫోటోలను తీస్తుంది. రిజిస్టర్
చేసుకున్న ఐడీకి మెయిల్ పంపిస్తుంది. ఇందుకోసం లాక్
కామ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. మొత్తంగా లుకవుట్ ఉంటే
మొబైల్ భద్రంగా ఉన్నట్లే. ఖరీదైన ఫోన్ కొనగానే సరిపోదు. అవసరమైన
యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడే ఫోన్‌కు, అందులోని డాటాకు
భద్రత లభిస్తుంది. ఈ యాంటీ థెఫ్ట్ యాప్స్ ఉంటే నిశ్చింతగా
ఉండొచ్చనడంలో సందేహం లేదు కదూ.

 

source http://heerasolutions.blogspot.in/

NO COMMENTS

LEAVE A REPLY