లగడపాటి బిజీ బిజీ…

0
260

LAGADAPATI_RAJ_GOP_1755674f

” లగడపాటి రాజగోపాల్ ” … ఈ పేరు రాజకీయాలలో  బాగా ఫేమస్… మీడియాకి బాగా ఫేవరెట్… లగడపాటి మొదటి నుండి  తెలంగాణ ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చాడు … రాష్ట్రం ముక్కలు అయితే తను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు,నిరాహార దీక్ష చేశాడు..  చివరికి తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు  దానిని నిరసిస్తూ ఏకంగా పెప్పర్ స్ప్రేను చల్లి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు .

చెప్పినట్టుగానే రాజకీయ సన్యాసం ప్రకటించిన లగడపాటి ప్రస్తుతం ఢిల్లీ సమీపంలోని గుర్ గావ్ లో ఉంటున్నారు. రాజకీయం తరువాత , తన సంస్థ అయిన లాంకో ఇండస్ట్రీస్ మీద ద్రుష్టి సారించారు.. ఇప్పుడు తన వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో తలమునకలయి ఉన్నారు. ఎక్కువ సమయం  గుర్ గావ్ లోనే  ఉంటున్నారు..తన కుటుంబం ని కలవడానికి మాత్రమే హైదరాబాద్ వస్తున్నారు…ఈ మధ్యనే చైనా కూడా చుట్టి వచ్చిన లగడపాటి పూర్తిగా బిజినెస్ మాన్ గా మారిపోతారో … లేదా మల్లి రాజకీయంలోకి రంగ ప్రవేశం చేస్తారో …చూడాల్సిందే…

 

NO COMMENTS

LEAVE A REPLY