బుల్లెట్ పై ఫైర్ అయిన సీయం గారు

0
244

K-Chandrasekhara-rao

“వెల్కమ్ టూ బుల్లెట్ న్యూస్, ఆయన అలా చేసారట, ఈవిడ ఇలా అందిట అయినా మనకెందుకు లెండి”  ఈ సంభాషణలు వినగానే అర్ధమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నామో TV 9 లో ప్రసారమయ్యే “బుల్లెట్ న్యూస్” గురించి.ఇప్పుడు దిని గురించి ఎందుకంటారా ఆ విషయనికే వస్తున్నా.ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనేయడంలో ముందు వుండే బుల్లెట్ న్యూస్ తెలంగాణా అసెంబ్లీ లో మొన్న ప్రమాణస్వీకారం చేసిన శాసనసభ్యులను ఉద్దేశించి “టూరింగ్ టాకీస్ మొఖాలు”,“ఎక్కడో మడచి పెట్టుకోన్నట్టు” అనే వ్యాక్యలు చేసారు.దానికి నిన్న తెలంగాణా సి.యం కెసిఆర్ అసెంబ్లీ లో మండిపడుతూ ఆంధ్ర మీడియా అంటూ దుమ్మేత్తిపోసారు. తమిళనాడు లో కేబుల్ నెట్వర్క్ ని జయలలిత ప్రభుత్వం టేకోవర్ చేసినట్టు తెలంగాణా లో మీడియా ని కూడా టేకోవర్ చేసే చట్టాలు గురించి అలోచిస్తునట్టు చెప్పారు.ఈ విషయం లో TV 9 ఒక అడుగు వెనక్కి తగ్గుతూ తమ ఛానల్ లో ప్రసారమైన “బుల్లెట్ న్యూస్” కార్యక్రమం పై  అసెంబ్లీని క్షమాపణ కోరింది.

NO COMMENTS

LEAVE A REPLY