Is Poverty Removal Stotram for improving wealth?

0
1256

daridra(2)

ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం

జగన్మాత శ్రీమహాలక్ష్మీ స్మరణం అన్ని రకాలైనటువంటి దారిద్ర్యాల నుంచి విముక్తి కలిగిస్తుంది. క్షణంలో నిరుపేదను సైతం శ్రీమంతునిగా కరుణించగల సామర్థ్యం ఆ తల్లిది! ఆ తల్లి 108 నామాలైన “లక్ష్మీ అష్టోత్తర శత నామా” లను నిత్యం చదివితే, సర్వ దరిద్రాలు తొలుగుతాయని, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ముందుగా ఆ తల్లిని శ్రద్ధగా ధ్యానించి. ఆ తరువాత దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని పఠించాలి.

ధ్యానం:

వందే పద్మాకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం.
హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం
భక్తా భీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మదిఖి:
సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభి:
సరసిజ నయనే సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి, ప్రసీద మహ్యమ్

ఈ దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని నిత్యం పఠించేవారికి, అన్ని రకాలైన దారిద్ర్యలు తొలగి శుభం కలుగుతుంది.

స్తోత్రం:

 

Daridra Vimochana Stotram is a very powerful prayer daily hindu   devotees. huge collection of devotional stotrams by teluguone

 

ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదాం
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం
వాచం పద్మాలయాం పద్మాంశుచిం స్వాహాం స్వధాం సుధాం
ధన్యాం హరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్పాం విభావరీమ్
అదితం చ దితిం దీప్తాం వసధాం వసుధారిణీం
నమామి కమలాం కాంతాం కామాం క్షీరోద సంభవాం
అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం
అశోకామమృతాం దీప్తాం లోకశోక వినాశినీం
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్ష్మీం పద్మ సుందరీం
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం
పుణ్యగంధాం సుప్రసన్నం ప్రసాదాభిముఖీం ప్రభాం
నమామి చంద్ర వదనాం చంద్రాం చంద్ర సహోదరీం
చతుర్బుజాం చంద్రరూపాం ఇందిరామిందు శీతలాం
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీం
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్య నాశినీం
ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం
భాస్కరీం బిల్వనిలయాం వరారోహం యశస్వినీం
వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం
ధనధాన్యకరీం సిద్ధిం స్రైణ్య సౌమ్యాం శుభప్రదాం
నృపవేశ్మగతా నందా వరలక్ష్మీ వసుప్రదాం
శుభాం హిరణ్యప్రాకారాం సముద్ర తనయాం జయాం
నమామి మంగళాం దేవీల విష్ణువక్ష: స్థల స్థితాం
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితం
దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికాం
త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధి విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియాం
మాతర్నమామి కమలే, కమాలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమలవాసిని, విశ్వమాత:
క్షీరోదజే, కమలకోమల గర్భగౌరి
లక్ష్మి ప్రసీద సతతం సమతాం శరణ్యే.

– See more at: http://www.teluguone.com/devotional/content/daridra-vimochana-stotram-943-22059.html#sthash.yRR1vT08.dpuf

 

NO COMMENTS

LEAVE A REPLY