health

0
506

download

మట్టి పాత్రలు వాడండి, మీకుటుంబ ఆరోగ్యం కాపాడుకోండి.

మన భారతీయులు పాటించే అలవాట్లలో, ఆచారాలలో ఖచ్చితంగా ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనం నిగూడంగా దాగి ఉంటుంది.

మట్టి పాత్రలో వంటచేస్తే చాల రుచిగా ఉంటుంది, అంతేగాక ఎక్కువ కాలం చెడిపోకుండా నిలువ ఉంటుంది. కావాలంటే మీ అమ్మమ్మనో, నాన్నమ్మనో అడగండి …….వాళ్ళు చెపుతారు.

అసలు మట్టిపాత్రలో ఏముందో చూద్దాం……….

పాత్రలు తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ ఫ్రా రెడ్ అనే కంటికికనిపించని కిరణాలు ( ఇన్ విజబుల్ రేస్ ) ఉత్పత్తి అవుతాయి.

ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తి స్థాయిలో శుద్ధి చేయబడుతుంది.

ఇక్కడ మీకు ఒక విషయం చెబుతాను………

మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతోపుట్టినా, పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరం లో ( లైట్ కింద పెట్టారు అని అంటారు ) కొన్ని గంటలపాటు ఉంచుతారు.

ఆ పరికరం లో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రా రెడ్ కిరణాలను ప్రసరింపజేసి, పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటలలోనే పాపకు పూర్తి స్తాయిలో ఆరోగ్యాన్ని సరి చేయగల శక్తి ఈ కిరణాలకే ఉంది.

మరి మట్టి పాత్రలో రోజు వంట చేస్తే…..? పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్ధం లోని పోషక విలువలను ఏమాత్రం వృధా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు చురుకుదనం కలిగించి ఆహారాన్ని అమృతతుల్యంగా మారుస్తాయి.

అందుకే ఈ పాత్రలో చేసిన వంటకాలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిలువ సామర్థ్యం చేకూరుతాయి.

మట్టి పాత్రలు వాడండి, మీకుటుంబ ఆరోగ్యం కాపాడుకోండి.

NO COMMENTS

LEAVE A REPLY