హ్యాకర్ ల కు బలి అయిన మరో బ్యూటీ

0
315

హకెర్

 

ఈ మధ్య కాలంలో హాలీవుడ్ హీరోయిన్లు, ఇంటర్నేషనల్ మోడల్స్ అకౌంట్స్ హ్యాక్ చేస్తూ వారి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్స్ తస్కరిస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. వారికి సంబంధించిన ప్రైవేట్ సమాచారం, నగ్న ఫోటోలు బయటకు లీక్ చేస్తూ సెలబ్రిటీ లోకాన్ని హడలెత్తిస్తున్నారు హ్యాకర్లు. ఇప్పటికే జెన్నిఫర్ లారెన్స్, రిహానా లాంటి హాలీవుడ్ స్టార్లు హ్యాకర్ల దాడికి బలయ్యారు. వారి వ్యక్తిగత నగ్న ఫోటోలు బయటకు లీక్ కావడంతో వారు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. దీనిపై ఎఫ్‌బిఐ విచారణ కూడా సాగుతోంది.

తాజాగా మరో తార హ్యాకర్ల దాడికి బలైంది. ప్రముఖ హాలీవుడ్ నటి, సూపర్ మోడల్ కారా డెలెవింగ్నే అకౌంట్ హ్యాక్ చేసి ఆమెకు సంబంధించి నగ్న ఫోటోలను బయటకు లీక్ చేసారు హ్యాకర్లు.

కారా డెలెవింగ్నే ప్రముఖ మోడల్‌గా పేరు గాంచింది. మేగజైన్లు, సినిమాల్లో అమ్మడు నగ్నంగా అనేక సందర్భాల్లో తన అందాలు ఆరబోసింది. అయితే లీకైన పిక్చర్స్ వల్ల ఆమెకు పెద్దగా నష్టం వాటిల్లే అవకాశం ఏమీ లేక పోయినా….తన ప్రైవేట్ పిక్చర్స్ లీక్ కావడంపై ఆమె కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లెవల్లో….హ్యాకర్లు ఇంతలా రెచ్చిపోతున్నా వారికి అడ్డుకట్ట వేడయంలో తలపండిన నిపుణులు సైతం విఫలమవుతున్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హ్యాకర్లు వివిధ రకాల టెక్నిక్స్ ఉపయోగిస్తూ రెచ్చిపోతున్నారు. ఈ హ్యాకర్స్ వ్యవహారంపై కొందరు అసంతృప్తిగా ఉన్నా…మరికొందరు మాత్రం పబ్లిసిటీ పెరుగుతోందనే సంతోషంలో ఉన్నారట.

NO COMMENTS

LEAVE A REPLY