ఘుమఘుమలు : కడాయి పనీర్

0
213

kadai-paneer

కడాయ్ పనీర్ కావలసినవి:

నూనె – టీ స్పూను;

పనీర్ – 100 గ్రా
బటర్ – 30 గ్రా;

ఉల్లిపాయ పేస్ట్ – 100 గ్రా
జీడిపప్పు పేస్ట్ – 10 గ్రా;

టొమాటో పేస్ట్ – 50 గ్రా

మిరప్పొడి – టీ స్పూను; 

కొత్తిమీర – కొద్దిగా
జీరాపొడి – అర టీ స్పూను
మెంతిపొడి – అర టీ స్పూను
పసుపు – అర టీ స్పూను
పంచదార – అర టీ స్పూను
రెడ్ కలర్ – రెండు చుక్కలు
ఉప్పు – తగినంత , 

నీరు : కొద్దిగా 

కడాయి పనీర్ తయారి విధానం : 

స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పనీర్ వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. తరవాత అదే బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వే సి బాగా వేయించాలి. గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించిన తరవాత అందులో మిరప్పొడి, జీరాపొడి, పసుపు, మెంతిపొడి, పంచదార, రెడ్‌కలర్ చుక్కలు, తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి. వీటన్నిటినీ బాగా ఉడికేదాకా ఉంచాలి. అప్పుడు గ్రేవీలాగ వస్తుంది. ముందుగానే వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. కాసేపు కలిపాక అందులో నుంచి నూనె పైకి తేలుతుంది. అప్పుడు స్టౌవ్ ఆపేసి ఈ పదార్థాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

NO COMMENTS

LEAVE A REPLY