వినాయక దండకం మీకు తెలుసా ?

0
6920

455px-Indian_God_Lord_Ganesh

వినాయక దండకం

 
 శ్రీ పార్వతీపుత్ర, లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకయా, కాత్యాయనీనాథసంజాతస్వామీ,శివాసిద్ధి విఘ్నేశ, నీపాదపద్మంబులన్ నీదుకంఠంబు నీబోజ్జ నీమోము నీమౌళిబాలేందు ఖండంబు నీనాల్గు హస్తంబులన్ నీకరాళంబు నీపెద్ద వక్త్రంబు దంతబు నీ పాదహస్తంబు, లంబోదరంబున్ సదామూషకాశ్వంబు నీ మందహాసంబు నీచిన్న తొండంబు నీగుజ్జరూపంబు నీశూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీభవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమబ్వక్షతల్ జాజులన్ చపకంబుల్ తగన్ మల్లెలున్ మోల్లలున్ మంచి చేమంతులన్ దెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలున్ పువ్వులన్ మంచి దూర్వంబున్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా! నీకు టెంకాయిపోన్నంటి పండ్లున్ మఱిన్ మంచివౌ నిక్షుఖండంబులన్ రేగు బండ్లప్పడల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులన్ వడల్ పునుగులన్ బూరెలున్ గారెలున్ చొక్కమౌచల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్న బాలాజ్యమున్ నానుబియ్యం బునామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్ళేమందుంచి నైవేద్యముంబంచి నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల్ సేయుటల్ కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ! యోభక్తమందార!యోసుందరాకర! యోభాగ్య గంభీర! యోదేవ చూడామణీ! లోక రక్షామణీ! బంధు చింతామణీ!స్వామీ! నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీదొంతరాజాన్వ వాయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్ నిల్పి కాపడుటేకాదు నిన్గోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్దిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! యివే వందనంబుల్ శ్రీగణేశా!                         
                                        నమస్తే నమస్తే నమస్తే నమః II                                 

NO COMMENTS

LEAVE A REPLY