file sharing app

0
721

ffa1325885789ae0706f884c9b0e0aa67adc70bd

మొబైల్ నుండి మొబైల్ కు లేదా మొబైల్ నుండి PC/లాప్ టాప్ కు అలానే లాప్ టాప్ నుండి మొబైల్ కు ఫైల్స్, ఇమేజెస్ etc ట్రాన్స్ ఫర్ చేసుకోవటం నిజంగా ఈ యాప్ రాక ముందు కష్టంగా ఉండేది అని చెప్పలి.

చాలా సింపుల్ గా, అంతకు మించి ఫాస్ట్ గా డేటా ను ఎటు నుండి ఎటైన ట్రాన్స్ ఫర్ చేయటానికి, ఇది అదే అన్నిటి కన్నా బెస్ట్ యాప్. దీని పేరు Share IT. ఇది చాలా మందికి బాగా తెలిసిన అప్లికేషన్. కాని తెలియని వారికీ కొత్త వరం లాంటిది.

ఇంతకుముందు ట్రాన్స్ ఫర్ కోసం డేటా కేబుల్స్ అవీ పట్టుకొని తిరగ వలసి వచ్చేది, ఇప్పుడు సింపుల్ గా sender అండ్ రిసీవర్ వద్ద యాప్ ఇంస్టాల్ అయ్యి ఉంటె చాలు. పని అయిపోయి నట్లే, ఇంటర్నెట్ అవసరం లేదు.

యాప్స్, ఫైల్స్ (ఏదైనా), ఇమేజెస్, సాంగ్స్, జిప్ ఫైల్స్, మూవీస్ అన్నీ ట్రాన్స్ ఫర్ చేస్తుంది. మేము 1 gb పై బడిన మూవీస్ కూడా ట్రాన్స్ ఫర్ చేసుకుంటాము. 4.4 స్టార్ రేటింగ్ తో 5.63MB ఉంది సైజ్.

ఇది WiFi హాట్ స్పాట్ టెక్నాలజీ తో వర్క్ అవుతుంది. WiFi వాడుతుంది కాని దానికి ఇంటర్నెట్ ఉండవసరం లేదు. ఇప్పుడు వైఫై లేని మొబైల్స్ మరియు లాప్ టాప్స్ ఎక్కడా లేవు. కాని PC కి మాత్రం Wifi ఉంది కాబట్టి దానికి పని చేయదు.

విండోస్ కంప్యుటర్ లకు షేర్ ఇట్ పేరుతోనే డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ కూడా ఉంది. అందుకే లాప్ టాప్ కు కూడా ట్రాన్స్ ఫర్ చేయగలరు. Share IT ఈ లింక్ లో నుండి డౌన్లోడ్ చేసుకుని వాడండి. ఇది లెనోవో తయారు చేసిన యాప్. 

ఆండ్రాయిడ్, ఆపిల్, విండోస్ ఫోన్, విండోస్ డెస్క్ టాప్ లకు అందు బాటులో ఉంది యాప్. పై లింక్ లో అన్నిటికీ ఒకే దగ్గర డౌన్లోడ్ లింక్ పొందగలరు.

NO COMMENTS

LEAVE A REPLY