మత్తు మందు ఇచ్చి కూతురిపై తండ్రి అత్యాచారం

0
438

Father Harrasing Daughter

విజయవాడ వాంబే కాలనీలోని కన్న కూతురిపై ఓ కర్కశమైన తండ్రి ఏడాది నుంచి అత్యాచారం చేస్తున్న సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. విద్యాబుద్ధులు నేర్పించి చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి ఓ యువకుడ్ని ప్రేమించిందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజిత్‌సింగ్‌నగర్‌లోని వాంబే కాలనీకి చెందిన అప్పారావు(42) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె (17) పదో తరగతి వరకు చదివి ఆపేసింది. ఓ యువకుడితో పరిచయం ఏర్పరచుకుందనే కారణంతో ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. బలం కోసం మందులని చెప్పి భార్యకు కుమార్తెకు మత్తు మందులు ఇస్తున్నాడు. వారు మత్తులోకి జారుకున్నాక ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తండ్రి తెచ్చిన మందులు మత్తు మందులని వారు గమనించలేకపోయారు. ఈ మధ్యకాలంలో అనుమానం వచ్చి భార్య ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లీకూతుళ్లు నున్న గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఏసీపీ లావణ్య లక్ష్మి, సీఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY