హిందూ ధర్మానికి కి కేంద్ర బిందువు ఏమిటో మీకు తెలుసా ?

0
267

 

“ఓం” అనే ఏకాక్షర మంత్రం… చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమfire-639225_640ని అంటారు. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. త్రిమూర్తి స్వరూపముగా ఓం, ఓమ్, లేదా ఓంకారము చెప్పబడుతోంది

వేదాలకు పునాది అనాది ప్రణవనాదం. లోకాలన్నీ ప్రణవం నుంచే ప్రభవించాయి అని అంటారు. పరమేశ్వరుడు ప్రణవ మంత్రాసీనుడై భాసిస్తుంటాడని, సంసార సముద్రాన్ని దాటించగల ఏకైకనాదం ప్రణవమని చెబుతారు.’ఓంకారం ఎప్పటికీ నశించని నాదం

. ఓంకారమే ఈ సకల విశ్వం. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఓంకారమే. కాల తీరాలకు ఆవల కూడా నిత్యమై ధ్వనించేది ఓంకారమే. ఈ విశ్వమంతా పరబ్రహ్మ స్వరూపమే. మనలోని పరమాత్మ ప్రణవనాదమే’ అని మాండూక్యోపనిషత్తు విస్పష్టంగా ప్రవచించింది.

భూమాత గర్భంనుంచి, తల్లి గర్భం నుంచి జన్మించానని భావిస్తున్న జీవాత్మ మొదట పరమాత్మనుంచే ప్రభవించింది. ఆత్మ ఆది ప్రణవమే అందుకే
“ఓం” అనే ఏకాక్షర మంత్రం హిందూ ధర్మానికి కేంద్ర బిందువు

NO COMMENTS

LEAVE A REPLY