దావూద్ ఇబ్రహీం కోసం వల వేస్తున్న కేంద్రం ?

0
253

GANGSTER DAWOOD IBRAHIM

దావూద్ ఇబ్రహీం – ఈ పేరు ఇండియా లో చాలా ఫేమస్ . మీకు తెలిసిన డాన్ పేరు చెప్పండి అంటే చాలా మంది మొదట దావూద్ పేరు నే చెప్తారు . ఇండియన్ పోలీస్ వాంటెడ్ లిస్టు లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో మొదటి పేరు దావూద్ దే. అతన్ని పట్టుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేసి విఫలమయారు పోలీసులు . మన పొరుగు దేశం పాకిస్తాన్ తో చేతులు కలిపి డ్రగ్స్ , మాఫియా , తీవ్రవాదులు వంటిని ఇండియా లో పెరిగేల చేసాడు. మన గవర్నమెంట్ కి తలనొప్పి గా మారాడు .

అయితే , ఇప్పుడు ఇతని ఆటలు కట్టు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది . నరేంద్ర మోడీ తన ప్రతాపం ని రుచి చూపించడానికి రెడీ అయ్యాడు. పేరుమోసిన అండర్వరల్డ్  డాన్లు చోటా షకీల్ మరియు దావూద్ ఇబ్రహీంలకు ఢిల్లీ లోని పాటియాలా కోర్ట్ సుమ్మోన్లు జారి చేసింది . దీని కోసం పబ్లిక్ నోటీసు కూడా జారి చేసింది . పాకిస్తాన్ లో తల దాచుకున్న  వీళ్ళను అక్కడి నుండి బయటకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు .

అమెరికా ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు ప్రస్తుతం పాకిస్తాన్ లో నే ఉనారని మరియు దావూద్ కి తీవ్రవాద సంస్థ ” అల్ – కైదా ” తో సంభంధాలు ఉన్నాయని నిర్ధారించారు . అందువల్ల అతని పై గట్టి నిఘా ఉంచారు . అయితే పాకిస్తాన్ మాత్రం మాకు దావూద్ కి సంభందం లేదు అని కపట నాటకాలు ఆడుతుంది . దావూద్ మరియు షకీల్ ముంబై బాంబు పెళ్లుల్ల ఘటన లో నేరస్తులు . వీరి మీద ఇంటర్పోల్ నోటీసు కూడా జారి అయింది .

NO COMMENTS

LEAVE A REPLY