confidence

0
688

635830500050315744

ఆత్మవిశ్వాసమే కీలకం 

 

కాన్ఫిడెన్స్‌.. ఇది లేకపోతే ఏ పని విజయవంతంగా పూర్తి చేయలేరు. మీలో కాన్ఫిడెన్స్‌ ఉందా? లేదా? అనే విషయాన్ని ఇతరులు స్పష్టంగా గుర్తించగలుగుతారు. అది మీ విజయాలపై ప్రభావం చూపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఏ పనైనా పూర్తి చేయగలరనే నమ్మకం కలుగుతుంది. మరి కాన్ఫిడెన్స్‌ పెరిగేదెలా? అంటే నేర్చుకోవడం, ప్రాక్టీస్‌ ద్వారానే సాధ్యమవుతుంది. కాన్ఫిడెన్స్‌ పెరగటానికి ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి.

  • ప్రిపేర్డ్‌గా ఉండండి. ప్లానింగ్‌, ప్రిపరేషన్‌కు ప్రత్యామ్నాయం లేదు. ప్రిపరేషన్‌ ఉంటే కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ వాటంతట అవే పెరుగుతాయి.

  • చేస్తున్న పనిని ఎంజాయ్‌ చేయడం నేర్చుకోండి. చేసే పనిని ఇష్టపడటం మొదలుపెడితే దాన్ని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఎక్కువ ఫలితాలు సాధించగలుగుతారు.

  • మీరు చేయాల్సిన పని ఏమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి. దానికి కావలసిన నైపుణ్యాలు ఉండాలి. అవి లేకపోతే సమర్ధవంతంగా పూర్తి చేయలేరు.

  • సహాయం అవసరమైనపుడు అడగడానికి సంశయించకండి. నేనే చేయగలను అనుకోవడం తప్పు. టీమ్‌వర్క్‌తో పనిచేసినపుడు ఉత్తమమైన ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

  • ఇతరులను పబ్లిక్‌లో, కొలీగ్స్‌ ముందు అభినందించడం నేర్చుకోండి. ఇతరుల్లో పాజిటివ్‌ ఫీలింగ్‌ డెవలప్‌ చేస్తే ఆ పాజిటివ్‌ ఎనర్జీ తిరిగి వచ్చి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది.

  • ప్రశ్నలు వేయడానికి వెనకంజ వేయకండి. అయితే మీ ప్రశ్న సూటిగా, సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. సందేహాలను స్వేచ్ఛగా అడగటం అలవాటు చేసుకోండి. ఏం కావాలో స్పష్టంగా అడిగినపుడు మీలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.

  • అవతలి వ్యక్తి సమర్థుడని అనిపించకపోయినా ప్రశ్నలు అడగండి. వెంటనే అతని నుంచి సమాధానం రాకపోయినా మరో ప్రయత్నంలో సమాధానం లభించవచ్చు.

  • కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడటం నేర్చుకోండి. అలాచూడటం అనేది మీలోని ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుంది.

  • ఆఫీసులోకి అడుగుపెట్టే సమయంలో రిలాక్స్‌గా ఉండండి. ఎంత రిలాక్స్‌గా కనిపిస్తే అంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు అప్పుడు స్వేచ్ఛగా పని చేయగలుగుతారు.

  • లక్ష్యాల పట్ల స్పష్టత ఉండేలా చూసుకోండి. అప్పుడే కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. కెరీర్‌లో విజయం లభిస్తుంది.

 

NO COMMENTS

LEAVE A REPLY